పుట:Naajeevitayatrat021599mbp.pdf/327

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పాదనలను దేశభాషలలోకి తర్జుమా చేయించి, ఆ విన్నపంమీద లక్షకుపైగా సంతకాలు సేకరించి, 1917 లో జరిగిన కలకత్తా కాంగ్రెసు నాటికే ప్రభుత్వం వారికి అందజేశాడు.

నాటినుంచి నేటివరకూ హిందువులకూ మహమ్మదీయులకూ సామరస్యం కుదరలేదంటూనే కాలయాపనచేస్తూ వస్తూన్న యీ బ్రిటిషు వారు ఆనాడు ఆప్రణాళికను త్రోసిపుచ్చి, మనకూ మనదేశానికి తీరని ద్రోహాన్ని చేశారు. పైగా వారు ఏ నోటితో భారతీయులు సంపూర్ణ స్వరాజ్యానికి అనర్హులని చెపుతున్నారో అర్థం కాదు. నిజానికి ఆ ప్రణాళికను అంగీకరించని కారణంగా ఈనాటివరకూ దేశంలో చెలరేగిన హిందూ మహమ్మదీయ కలహాలకు బాధ్యులు వారే. వారి మూలం గానే యీ చికాకులన్నీ దేశంలో ప్రబలుతున్నాయని వారిపై నేరారోపణ చేయడం సమంజసం. కాంగ్రెసును చేపట్టిన నూతన వర్గీయులు కూడా ఈ పరిస్థితులకు కొంతవరకూ బాధ్యులు. వారు సత్వర చర్యలు తీసుకుని, అవసరమయిన ప్రబోదాలూ, ప్రచారం చేస్తూ బాధితులకు ఆర్థికాది సహాయాలు చేసి వుండివుంటే పరిస్థితులు చక్కబడే ఉండేవి. అటు ప్రభుత్వంవారూ, ఇటు కాంగ్రెసువారూ కూడా స్వలాభాపేక్షతోనూ, అలసవల్లనూ అవసర చర్యలను తీసుకోకపోడంచేత దేశంలో దుష్టశక్తులు వీరవిహారం చేశాయి. కలహాలు రెచ్చగొట్టగల పుణ్యాత్ములు ముందుకు రాగలిగారు.

మాలవ్యాజీ మనస్తాపం

1922 ముల్తాన్ కొట్లాటలనాటి హిందూ మహమ్మదీయ మత వర్గాల వారి మనోబావాలకీ, షహజాన్‌పూరులో 1923లో జరిగిన కలహాల నాటి వారి మనోభావాలకీ వున్న తేడాపాడాలు విలియా వేసుకోవడం ఇప్పట్టున న్యాయం. ముల్తాన్ కొట్లాటల నాటి నిరాశా, షహజాన్‌పూర్ కలహాల నాటి నిస్సహాయతా గ్రహించిన మాలవ్యా మహాశయుడు ఆత్మరక్షణ కోసమూ, దేశభద్రతకోసమూ ప్రాయచ్ఛిత్తాలూ, శుద్ధులూ, పుణ్యాహవచనాలూ, హోమాలులాంటివి జరిపించి, ఆత్మ