పుట:Naajeevitayatrat021599mbp.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అదనని అవకాశవాదులు తలచారు. ముల్తాన్ సంఘటనల తరవాత, కాంగ్రెసువారి స్తబ్దతవల్లనే, మళ్ళీ షహజాన్‌పూర్ అల్లర్లూ, కలతలూ తలయెత్తాయని చేప్పాలి.

షహజాన్‌పూరు సంఘటనలకు ఆర్థిక కారణాలే మిక్కుటం. ఆహార వస్తువుల ధరలు అధికారులు అదుపులో పెట్టకపోవడమే యీ చికాకులకు ముఖ్య కారణం అనక తప్పదు. అంతేకాదు, అల్పసంఖ్యాకులయిన హిందువుల చేతులలోనే విస్తారంగా ఈ వ్యాపారాలు ఉండడమూ, ధరల కంట్రోళ్ళన్నీ ఆ హిందువుల చేతులలోనే ఉండడమూ బలవత్తర కారణాలయ్యాయి. ధరలు తగ్గించడానికి హిందూ వర్తకులు ఎంత మాత్రం ఒప్పుకోలేదు. దాన్తో అక్కడా అక్కడా లూటీలు, దోపిడీలు ఆరంభం అయ్యాయి. కొంపలు కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో తగల పెట్టబడ్డాయి. ఇటుక, సిమెంటు, రాతి గోడల మధ్య భద్రపరచబడిన పెద్ద పెద్ద ఇనుప పెట్టలే వూరివెలపలకు, మూడు నాలుగు మైళ్ళ దూరాన వున్న మారు మూలలకు తరలింపబడి పగల గొట్టబడ్డాయి.

ఒక విధంగా, లక్నో ఒప్పందాలు పున:పరిశీలన చెయ్యాలి, మహమ్మదీయులకు ఇతోధికంగా హక్కులూ, అధికారాలూ, ఆర్థికసౌకర్యాలూ కలుగ జెయ్యాలి అన్న ప్రచారమే యీ కలతలకు మూల కారణం అన్నది నిర్వివాదాంశం, లక్నో ఒడంబడిక లోప భూయిష్ఠమనే మాట ప్రతి మహమ్మదీయుని నోట ఉండే దన్నమాట! నిజానికి 1916లో జరిగిన యీ ఒడంబడిక తర్వాత రేగిన దుమారాన్ని కాంగ్రెసువారూ, సహకార నిరోధక వర్గాలవారూ, స్వరాజ్య పార్టీవారూ గమనించి అవసర చర్యలు తీసుకుని ఉండి ఉంటే, ఇంత అసహనం, గందరగోళం, రక్తపాతం వగైరా ఉండేవి కావు. ఇది యేదో ఒక రోజున, ఒక నెలలో, ఒక సంవత్సరంలో తలయెత్తిన తగవులాట కాదు. ఆ లక్నో ఒడంబడిక మూలంగా లాభాలు పొంది, ఉద్యోగాదులలో పై మెట్లు ఎక్క గలిగిన ఆ జనానికి ఆశ యెక్కువయి, ఇంకా సంక్షోభాలు తీసుకు రాగలిగితే తమకు ఇంకా లాభాలూ, క్షేమాలూ