పుట:Naajeevitayatrat021599mbp.pdf/321

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిజానికి మేము ఇవ్వగలిగిందీ, ఇవ్వదలచిందీ అతి స్వల్పమే అయినా, అదనుకి అ సొమ్ము పంపకంచేసి ఉండిఉంటే కాంగ్రెసు సదుద్దేశాన్ని రుజువుచేసి, కాంగ్రెసు గౌరవాన్ని కాపాడగలిగేవారం. ప్రజలలో కాంగ్రెసుపట్ల విశ్వాస గౌరవాలు వర్ధిల్లేవి. అవసరమయినప్పుడు ఆర్తులకు సేవచేయ గలగడం నిజంగా ఎన్నివిధాలో కాంగ్రెసు భావికి తోడ్పడేది. హిందూ మహమ్మదీయ మైత్రి దృడతరం అవడానికి ఉపన్యాసాల ద్వారానే గాక క్రియాత్మకంగా కూడా దోహదం చేసినట్టు అయేది. బహుశ:పండ్రెండు మాసాల అనంతరం షహజాన్‌పూరులో కొట్లాటలు జరగకుండా ఉండేవి. ఎప్పుడయితే ఇస్తామన్న ధనాన్ని పంచి పెట్టకలేకపోయామో, అప్పుడే నాయకుల గౌరవం మంటకలసింది.

పార్టీ విభేదాలు తెచ్చిపెట్టిన ముప్పు

ఇలాంటి పరిస్థితులలో నో ఛేంజ్, ప్రోఛేంజ్ పార్టీలవారు తమ హక్కుల గురించీ ఆదర్శాల విషయమై ఆర్భాటాలు చేస్తూ, కక్షలు పెంచుకుంటూ ఉండేవారన్నమాట!

ఈ రకమయిన అలజడులూ, ఎత్తు పై ఎత్తులూ లక్నో ఒడంబడిక జరిగిన నాటినుంచీ, అనగా 1916 నుంచీ, 1922 లో ముల్తాన్ కొట్లాటలు జరిగే పర్యంతమూ తలేత్తుతూనే ఉన్నాయి. ముల్తాన్ ఉదంతం యీ పై కారణాల వల్లనే అంత ఉద్ద్రుతంగా సాగిందని అనడానికి వీలులేకపోయినా, ఆ అలజడికి ఈ ఒడంబడికలు కారణాలు కావనిమాత్రం అనలేము.

ముల్తాన్ కొట్లాటలు జరిగిన తర్వాత, లక్నో ఒడంబడికలో మార్పులు చెయ్యాలనే వాదం ప్రబలమైంది. కాంగ్రెసు నాయకులలో పెచ్చు పెరిగిన అలసత, ముల్తాన్ ఉదంతమూ మహమ్మదీయులలో అసంతృప్తిని రేకెత్తించడానికీ, అవకాశవాదులు ఆందోళన చెయ్యడానికి తోడ్పడ్డాయి. ఆ రోజులలో అచ్చయి పంచిపెట్టబడిన సారస్వతం అంతా అవకాశవాదుల ఎత్తుగడలను రుజువు చేస్తుంది. ఒకవంక కాంగ్రెసును మట్టుబెట్టాలని ప్రభుత్వంవారు, ఇంకొకవంక హిందూ