పుట:Naajeevitayatrat021599mbp.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలా రహస్య సంఘా లున్నాయనికూడా వారు చెప్పారు. బెంగాలులో తల యెత్తిన విప్లవ సంఘాలను ఆంగ్లేయ ప్రభుత్వంవారు భారతీయ ఉద్యోగులచేతేనే వెనువెంటనే అణగద్రొక్కించారు.

ఆ విప్లవోద్యమం అంతం అవుతూన్న రోజులలోనే, నెహ్రూగారి పూర్తి సలహా సంప్రతింపులతోనే, గాంధీగారు అక్కడ ఈ అహింసాత్మక సహకార నిరాకరణ ఉధ్యమం స్థాపించడం జరిగింది. కాని, కొద్ది రోజులలోనే పుంజుకున్న గాంధీగారి సత్యాగ్రహ విధానం మోతిలాల్‌గారికి అంతగా నచ్చలేదు. నిజానికి గాంధీగారి విధానపు బలిమి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాక సందర్భంలో రుజువైనా, తాము చెప్పినా గాంధీగారు వైస్రాయి రాజీ ప్రతిపాదనలకు ఒప్పుకోక పోవడంచేత, మోతిలాల్‌గారికి గాంధీగారి విధానంపట్ల విముఖత్వం ఏర్పడింది. గయా కాంగ్రెసు తరువాత గాంధీగారి కార్యక్రమం క్రమంగా మూలబడింది.; ఆయన జైలుకు వెళ్ళిన ఏడాదిలోపలే త్రివిధ బహిష్కారోద్యమం రెండు మాసాలపాటు నిలుపు చేయబడిన సంగతి 1924 ఫిబ్రవరిలో విడుదలై వచ్చిన గాంధీగారు తెలుసుకుని తన ముఖ్య అనుచరులే తన విధానానికి అనుకూలంగా లేరనే విషయాన్ని, అప్పటి పరిస్థితిని గ్రహించి, ఆయన శాసన సభా ప్రవేశానికి ఒప్పుకున్నారు. అయినప్పటికి మోతిలాల్‌గారికి పూర్తిగా సంతుష్టి కలుగలేదు.

గాంధీగారిని 1924 లో హాస్పిటల్నుంచి విడుదల చేశాక అహమ్మదాబాదులో జరిగిన అఖిల భారత కాంగ్రెసు కమిటీ సమావేశ సందర్భంలో ఆయన్ని కలిసికొని, ఆయన జైలుకు వెళ్ళినదాదిగా జరిగిన సంఘటనల నన్నింటినీ నేను ఎరుక పరిచాను. ఆయన సన్నిహితులే ఆయన మార్గానికి నిరోధకులవుతున్నారన్న విషయాన్ని సూచిస్తూ, మహమ్మదాలీ మున్నగు వారందరూ ఆయన్ని ద్రోహం చేశారని చెప్పాను. కాని నా మాటలయందు వారికి అంతగా విశ్వాసం కలిగినట్లు లేదు. సింధు దేశీయుడైన చౌత్రాంగారు ఈ సంగతే తిరిగి చెప్పిన తర్వాత సభలోనే గాంధీగారి కళ్ళనుండి నీళ్ళు కారాయి.

సన్నిహితులయిన అనుచరుల సంగతి సందర్భాలు ఎల్లా ఉన్నా,