పుట:Naajeevitayatrat021599mbp.pdf/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లాయర్లు. పైన ఉండి సహకార నిరాకరణ చెయ్యవలసిందని చెప్పిన గాంధీగారూ, లోన జొరబడి సత్యాగ్రహం సాగించమని ప్రబోధించిన దాస్-మోతిలాల్‌గార్లూ ఉద్యమాలు సాగించి ఉండి ఉంటే, కౌన్సిల్ లోపల ఉండిన వారి సహకారం కాంగ్రెసును ఛిన్నాభిన్నం చేయడానికి మాత్రమే ఉపకరించి, బైటనుంచి గాంధీగారు నడిపించే సహకార నిరాకరణ విధానానికి పెద్ద దెబ్బగా ఉండేది.

పగటికలల పరిసమాప్తి

స్వరాజ్యవాదులు లోన ప్రవేశించి పరిపాలనా యంత్రాన్ని బలహీనం చేయడమన్న విషయంలో అపజయాన్ని పొందినా, కాంగ్రెసునూ, గాంధీగారినీ బలహీనంచేసి, కాంగ్రెసు వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయడంలో మాత్రం జయాన్ని సాధించారు. వాదోపవాదాలు సాగించే సందర్భంలో వారు, తాము అవలంబించే విధానానికి లక్షలాది జనుల అనుమతిని పొందలేరనే విషయాన్ని గ్రహించ లేకపోయారు. పైగా అసెంబ్లీలోని తోటి వారంతా కలసినా, వారికంటె బలవంతులు కాలేరన్న సంగతి కూడా వారు గ్రహించి ఉండరు. అంతేకాదు, వారికున్న దుర్బలత్వంచేత క్రమేపీ వారి పార్టీ శక్తిహీనమయి, క్షీణించి క్షీణించి నశించేది. లార్డ్ రీడింగ్ స్వరాజ్యపార్టీ నాయకులతో ఇంకా బేరాలు పెడుతూన్న నాటికి వారి పరిస్థితి అల్లా ఉండేది.

1926 ప్రారంభ దినాలలో, సెంట్రల్ అసెంబ్లీలో జరుగుతూన్న బడ్జెట్ మీటింగులకు మోతిలాల్ నెహ్రూగారు, తమ పార్టీతో సహా వెళ్ళినప్పుడు వారి కళ్ళు పూర్తిగా తెరువబడి , అంతవరకూ వారు కంటూ ఉన్నవి పగటి కలలేనని తెలిసికో గలిగారు. ప్రభుత్వం వారు సకాలంలో సవ్యంగా సహకరించి సంచరించకపోతే దేశం అంతటా "రకరకాల సంఘాలు" ఏర్పాటవుతాయి, జాగ్రత! అని హెచ్చరిస్తూ, వారూ వారి పార్టీ వారూ అసెంబ్లీ చర్చలలో పాల్గొనకుండా బైటకు వచ్చేశారు.

మోతిలాల్ నెహ్రూగారు, తానూ తన పార్టీవారూ తిరిగీ