పుట:Naajeevitayatrat021599mbp.pdf/305

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చారు. అప్పుడే, ఆ రాజీ సూచనల కారణంగానే, దాస్-మోతిలాల్ గార్లకూ, గాంధీగారికీ మధ్య విభేధాలకి అంకురార్పణ అయింది. స్వరాజ్యవాద నాయకులకు నిరవధికంగా ఆశలు కల్పిస్తూ, వైస్రాయి తన బుద్ధి చాతుర్యం ఉపయోగించి దేశ నాయకులలో చీలికలు తీసుకురాగలిగా డన్నమాట. ఈ ప్రకారంగా దేశీయుల ఐకమత్యాన్నీ, కాంగ్రెసు బలాన్నీ క్షీణింపజేయడం పాలకుల విధానం అయింది. బర్కెన్ హెడ్ సెంట్రల్ అసెంబ్లీ ప్రాంగణంలో చేసిన (7-7-1925) ప్రసంగంలోని ఆశాజనక వాక్యాలు 20-1-1926 న భారత శాసన సభను ప్రారంభిస్తూ రీడింగ్ ప్రభువు పునశ్చరణ చేశాడు.

ప్రిన్స్ ఆఫ్ వేల్స్ పర్యటన సందర్భంలో 1921 లో దేశీయులు అవలంబించి, నడిపించ గలిగిన బహిష్కరణ విధానం, లార్డ్ రీడింగ్‌నీ, ఆయన పరిపాలనా యంత్రాంగాన్నీ ఊపి పారేసింది. అప్పటి నుంచీ ఆలోచనా సాగరంలో ములిగిన ఆ రాజకీయ వేత్తలు, మెల్లి మెల్లిగా స్వరాజ్యపార్టీ నాయకుల హృదయాలలో దౌర్బల్య బీజాలునాటి, వారికి లేనిపోని ఆశలు కల్పించి, మొత్తంమీద మూడు సంవత్సరాలలో, వారిని మెత్త పడేటట్టు చేశారు. వారి ఉద్యమాన్ని త్రొక్కిపారేశారు. వారి ఆటలు 13-3-1922 లో గాంధీగారి నిర్బంధంతో ఆరంభమయి, అయన్ని 5-4-1924 న విడుదల చేసిందాకా, అవిచ్ఛిన్నంగా సాగాయి.

మోతిలాల్‌నెహ్రూ నాయకత్వం

1926 వ సంవత్సరం మార్చి 6,7 తేదీలలో అఖిల భారత కాంగ్రెసు కమిటీ మీటింగు ఢిల్లీలో జరిగింది. నేనా మీటింగుకు హాజరయ్యాను. అంతక్రితం సరోజనీదేవీ అధ్యక్షతను కాన్పూరులో జరిగిన కాంగ్రెస్‌లో తీర్మానింపబడిన ప్రతిపాదనలన్నీ ఈ మీటింగులో బలపరుప బడ్డాయి. అంతేకాదు, స్వరాజ్య సంపానకై తాము చేస్తున్న కృషికి అవరోధంగా, పాలకులు అవలంబిస్తున్న విధానాల నన్నింటినీ ఖండించి, వాటిని శాంతియుతంగా ఎదుర్కోవాలని నిశ్చయించబడింది. ఇంకొక స్పెషల్ తీర్మానంలో కాంగ్రెసు కార్యక్రమానికి నిరోథకమైన