పుట:Naajeevitayatrat021599mbp.pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలకత్తా" పత్రికా సంపాదకులు శ్యామసుందర చక్రవర్తిగారు ఈ విషయాలన్నీ చక్కగా వివరిస్తూ తమ పత్రికా ముఖంగా ప్రచురించేవారు.

ఆయన అన్నారు. "దాస్, నెహ్రూగార్లు బహిరంగ సభలో విరాళాల కోసం విజ్ఞప్తి చేసినప్పుడు, దాతలు తాము ఇచ్చే విరాళంలో సగం వారు తీసుకుని, మిగతా సగం గాంధీగారి నో ఛేంజి పార్టీవారికి అందచేయాలంటూ వచ్చారు. తర్వాత కొంత కాలానికి నేను బొంబాయిలో ఎస్. పి. బొమ్మంజీ ఇంటిలో దాస్-మోతిలాల్‌గార్లను కలుసుకున్నప్పట్టి ఉదంతం వినండి. వారు తాము తమ పార్టీకి విరాళాలకోసం వచ్చామని చెప్పారు. "నేను మీపార్టీవారికి రు 500/-లు నిరభ్యంతరంగా ఇస్తాను. కాని కాంగ్రెసు పార్టీవారికికూడా, వారు అడక్కపోయినా, అదేప్రకారం రు 500/-లు ఇవ్వ నిశ్చయించుకున్నా" నన్నారు బొమ్మంజీ.

కాకినాడలో 1923 డిసెంబరు మాసంలో, కాంగ్రెసు సమావేశం అయ్యేలోపల, గయా కాంగ్రెసు తీర్మానం దాస్-మోతిలాల్‌గార్లు చిన్నాభిన్నం చేయగలిగారు. గయా కాంగ్రెసు తీర్మానానికి డిల్లీ స్పెషల్ కాంగ్రెసువారు తిరుక్షవరం చేశారన్న సంగతి మరువరానిదే. స్వరాజ్య పార్టీవారికి నవంబరు 23 న జరుగనున్న ఎన్నికలలో పాల్గొనడానికి అనుమతి ఇవ్వడం, గయా తీర్మానానికి తిరుక్షవరమే కదా!

స్వరాజ్యవాదుల విధానంలో మార్పు

కాకినాడలో డిసెంబరు మాసంలో జరిగిన కాంగ్రెసులో ఢిల్లీ తీర్మానాన్ని ఒక షరతుమీద బలపరిచారు. స్వరాజ్య పార్టీ వారు కౌన్సిల్ ఎంట్రీ పోగ్రాంను అన్ని విధాల అమలు పరచుకోవచ్చు. ఎన్నికలలో నెగ్గి, కౌన్సిల్‌లో ప్రవేశించ వచ్చును. కాని, వారు ఒక్క విషయాన్ని మాత్రం విస్మరించరాదు. ఎన్నోవిధాల అడ్డంకులమీద అడ్డంకులు కల్పిస్తూ పరిపాలన సాగకుండా, కౌన్సిల్లో కూర్చునికూడా సహకార నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగించాలి.

తమ రాష్ట్రంలో ప్రభుత్వ విధానం కొనసాగకుండా కొంత