పుట:Naajeevitayatrat021599mbp.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాలానికి చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహం ఆరంభించిన సందర్భంలో నేను గురుకాబాగ్ పద్ధతులను, భారీ యెత్తున కాకపోయినా, అమలు పరచడానికి పూనుకున్నాను.

ఆ ఉప్పు సత్యాగ్రహపు రోజులలో, చెన్నపట్నంలో ఆ అకాలీల పద్ధతులమీద ఆరంభింపబడిన "ఉదయవనం" కాంప్ కొన్ని నెలల పాటు మద్రాసు వాస్తవ్యులు ఉచితంగా ఇచ్చిన విరాళాలతో మేమందరం అరెస్టు అయ్యేదాకా చాలా బాగా నడిచింది. దీనిని గురించి ముందు ముందు చెపుతాను.

15

కొన్ని ముఖ్య ఘట్టాలు

నేను 23-2-1923 వ తేదీని వర్కింగు కమిటీ సభ్యత్వానికి అలహాబాదులో రాజీనామా ఇచ్చిన సందర్భంలో, వర్కింగు కమిటీవారి మినిట్సు బుక్కులో, ఇల్లా వ్రాశాను: "చిత్తరంజందాస్, పండిత మోతిలాల్ నెహ్రూగార్ల ప్రోద్బలంతో, త్రివిధ బహిష్కార సూత్రాన్ని రెండు మాసాలపాటు విరమించ దలుచుకున్నారు. మంచిదే. కాని వారు కట్టెను చీల్చడానికి నాటిన గొడ్డలి మొన ఆ కట్టెను చీల్చడానికే ఉపయోగపడేటట్లు ఈ విరమణ అన్నది నిర్విరామంగా సాగుతుంది." సరిగా ఆ ప్రకారమే జరిగింది. దాస్-మోతిలాల్ గారలు రెండు మాసాలపాటూ ప్రజల్నీ, ప్రజాహృదయాన్నీ "కౌన్సిల్ ఎంట్రీ" విధానానికి అనుకూలంగా ఉండేటట్లు, త్రిప్పుకోవడానికిగాను, దేశమంతటా పర్యటించారు. త్రివిద బహిష్కార విధానానికి విరమణ అన్నది జరగడంతోనే, ప్రజల్లో ఆ విధానంపట్ల ఉన్న గౌరవ భావం సన్నగిల్లింది. ఎప్పుడయితే దాస్-మోతిలాల్ గార్లు ఆ విషయంలో ప్రజాభిప్రాయాన్ని తమ వైపు త్రిప్పుకోగలమనే ఆశతో యాత్రకు బయల్దేరారో, అప్పుడే మిగిలిన కాస్త గౌరవమూ పూర్తిగా దెబ్బతింది. "సర్వెంట్ ఆప్