పుట:Naajeevitayatrat021599mbp.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిత్తలా, మిలిటరీ పద్ధతిగా పడుకుని ఉండేవాడు. ఆ దెబ్బలు తిన్న వ్యక్తులలో ముగ్గురు వయోవృద్దుల్ని, "మీ పటకాలలో కృపాణ్ ఉండగా మీకు ఇన్ని దెబ్బ లెల్లా తగిలాయి?" అని అడుగుతే, ఆ ముగ్గురూ కూడా ఒకే విధంగా సమాధానమిచ్చారు. "మేము శాంతంగా ఉండడానికి కారణం మమ్మల్ని అహింసాత్మకంగా మెలగ వలసిందని మాకు ఇవ్వబడ్డ ఆజ్ఞా" అని. అడిగిన దాస్‌గారికీ, సమాధానాలు విన్న మాకూ విస్మయమే కలిగింది. సురక్షితమైన ఈ పద్ధతిలో ఆ అహింసాత్మక సమరం చాలా రోజులే నడిచింది.

అక్కడనుండి మేము లంగర్‌ఖానా చూడ్డానికి వెళ్ళాము. నేను అంతవరకూ అంత భారీఎత్తున ఏర్పాటయిన వంటసాలలను చూడలేదు. ప్రతీ పావుగంటకీ గుర్రాలమీదనో, గాడిదల మీదనో కావలసిన వస్తు సముదాయం సప్లయి అయ్యే యేర్పాట్లు చేయబడ్డాయి. వంటసాలలోనూ, సామగ్రిని శుభ్రపరిచే జాగాలోనూ కూడా ఘరానా కుటుంబాలకు చెందిన స్త్రీలు ఆహ్లాదంతో సేవ చేయడం గమనించాము. నిజంగా అది ఒక ఆదర్శప్రాయమైన యేర్పాటు. లంగర్‌ఖానాలో తయారైన ఆహారము మాకు వడ్డించి భోజనం పెట్టారు.

ఉద్యమ విజయం

అకాలీలకు తమ ఉద్యమాన్ని విరమించి దేవాలయాధికార్లతోనూ, ప్రభుత్వంవారితోనూ రాజీ పడవలసిందని చాలామంది సూచించారు. కాని వారు విరమించడానికి ఎంతమాత్రమూ అంగీకరించ లేదు. ఉద్యమం చాలా తీవ్రతరం అయింది. అక్కడ పోలీసులు సాగిస్తూన్న హింసాకాండని పెద్దలు సహించలేకపోయారు. చూసిన పెద్దలూ, రాజకీయ వేత్తలూ కూడా ఆ హింసా కాండ సహించలేక భారత ప్రభుత్వంవారికీ, పంజాబు ప్రభుత్వంవారికీ కూడా దానిని వెంటనే ఆపవలసిందని టెలిగ్రాము లిచ్చారు. పెద్దలయొక్క, ప్రజలయొక్క ఒత్తిడి అంతకంత కధికమయింది. దాన్తో ప్రభుత్వం వారూ,