పుట:Naajeevitayatrat021599mbp.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విచారించడానికి "హక్కు" (Jurisdiction) లేదనిన్నీ వాదించాను.

ఈ విషయం మా ఇరువురి మధ్యా చాలా రగడే రేకొల్పింది. శంకర్‌లాల్ బ్యాంకర్ కూడా చింతాక్రాంతుడయ్యాడు. మధ్యవర్తి పరిష్కారానికి ఒప్పుకోవలసిందని ఆయన నన్ను కోరాడు. మధ్యవర్తి పేరడిగాను. గాంధీగా రన్నాడు. లోగడ జరిగిన ఇంకొక ఉదంతం కారణంగా గాంధీగారి మధ్యవర్తిత్వానికి నేను ఒప్పుకోలేదు. అప్పట్లో రాజగోపాలాచారి గారికీ, నాకూ వచ్చిన ఒక లావాదేవీలో గాంధీగారు, నావాదన వినకుండానే, రాజగోపాలాచారిగారికి పదివేలు ఇవ్వమని చెప్పిన చొప్పంతా వివరించాను. ఆయన చేతిలో ఒకప్పుడు నష్టపడిన కారణంగా ఇప్పుడు తిరిగీ ఆయన మధ్యవర్తిత్వానికి అంగీకరింపజాలనని తెలియబరచాను.

ఆ కేసు నడుస్తూన్న రోజులలో నేను బర్మా, మలయా మున్నగు ప్రాంతాలలో సకుటుంబంగా పర్యటిస్తూ, జరుగనున్న కాంగ్రెసు సమావేశాలకు ముందుగా పట్నం చేరుకున్నాను

నేను జామీనుదారునే

నేను స్వయంగా అ.భా.చ. సంఘం వారితోటీ, గాంధీగారితోటి తగాయిదాలోనికి దిగి, వ్యవహార కాండంతా నడిపిస్తూ ఉన్నా, గోపాలశాస్త్రిగారికి భాధగానే ఉంది. అ.భా.చ. సంఘం నుంచి స్వయంగా డబ్బు పుచ్చుకున్నది ఆయన. నేను కేవలం జామీనుదారునే. అందువల్ల ఒక ప్రక్క గాంధీగారూ, అ.భా.చ. సంఘంవారూ ఉండడమూ, రెండవ ప్రక్క మేము ఇరువురమూ ఇరుక్కోవడమూ గమనించి, ఈ కీచులాటను తప్పించాలని ఆయన తలిచారు.

దావాపడే ముందు మేము సవ్యంగా వ్యవహరించాలనే భావనతో, గోపాలశాస్త్రిగారితో ఉన్న సామానులన్నీ-రాట్నాలూ, మగ్గాలూ, దూదీ, నూలూ, వస్త్రాలు, ఏ రూపంలో ఉన్నా సరే-ఉన్నవి ఉన్నట్లుగా, సరిగా మూటలు గట్టి, అ.భా.చ. సంఘంవారి ప్రాంతీయ ప్రతినిధి కొండ వెంకటప్పయ్య పంతులుగారికి స్వాధీనం చేయమన్నాను. ఆ