పుట:Naajeevitayatrat021599mbp.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వారిచే అంగీకరింపబడక పూర్వమే ప్రచురించడానికిగాని మా పత్రిక యెప్పుడూ పూనుకోలేదు.

ఆయన "పాలసీ" లను బైటపెట్టి, ఆయన కార్యక్రమాదులకు అడ్డంకులు కలుగజేసి, ఆయన్ని చికాకు పెట్టింది "స్వరాజ్య" కాదు; ఇవన్నీ ఆయన ముఖ్య స్నేహితుడూ, నమ్మినబంటూ, సన్నిహిత శిష్యుడూ అయిన రాజగోపాలాచారి గారూ, అయనచే ఏర్పరుపబడిన వర్కింగు కమిటీని, వారే అటువంటి పనులను చేసినవారు. నిజానికి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని రెండు మాసాలపాటు విరమిస్తామన్న తీర్మానాన్ని నిరసించిన వాడిని నేను ఒక్కడినే. ఆ భేదాభిప్రాయాల మూలకంగా, "సెంట్రలు పార్టీ" అంటూ లేవతీసి, ఆ రెండుపార్టీలవారి మధ్యా సామరస్యం తీసుకు రావాలని తంటాలు పడింది నేను. కాకినాడ కాంగ్రెస్‌లో దాస్‌గారిని "సపోర్టు" చేయడం కూడా, లోగడ ఢిల్లీ కాంగ్రెసువారు అవలంబించిన విధానం సమర్థించడమే.

ఇటువంటి పరిస్థితులలో నాచే ప్రారంభింపబడి, నడుపబడుతూన్న పత్రికను వెంటనే ఆపివేయవలసిందని గాంధీగారు అనడానికి కారణం, బహుశ:నాపైనా, నాపత్రికపైనా ఎవరో స్వార్థపరులు నిందలు మోపి, నాపత్రిక మూలంగానే వారి కార్యక్రమం భంగమయిందనీ, నా పత్రికే అందుకు కావలసిన దోహదం చేసిందనీ, చెప్పి ఉంటారని నేను విశ్వసించాను.

నిజానికి యీ పరిస్థితుల కన్నింటికీ మూలకారణం వారి అనుచరులలో యేర్పడిన అలసతా, దుర్బలత్వమేనని. ఆ దుర్బలత్వ కారణంగానే వారు దాస్-మోతిలాల్ గార్లతో వివాదపడి రచ్చకెక్కకుండా, వారికి అనుగుణంగా ప్రవర్తించి ఉన్నారనీ ఆయనకు తెలియక పోవచ్చు ననే నేను భావించాను. అప్పట్లో ఆయన అనారోగ్య పరిస్థితినీ, శరీర దౌర్బాల్యాన్నీ గమనించి నేను ఆయనతో వాదనకు దిగలేదు.

నా సమాధానం

కాని, పూర్తిగా స్థిరపడిన పత్రికను మూసివేయడమన్నది అంత చులాగ్గా జరిగే పని కాదనీ, గత మూడు సంవత్సరాలనుంచీ