పుట:Naajeevitayatrat021599mbp.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టారని తోచినప్పుడు, చాలా తీవ్రంగా విమర్శించేవాణ్ణి. నేను బర్మాదేశంనుంచి తిరిగి వచ్చిన తర్వాత, మోతిలాల్ నెహ్రూగారు స్వయంగా యీ సంగతే చెప్పుకున్నారు. "స్వరాజ్య" చాలా తీవ్రంగా విమర్శిస్తోందని వాపోయారు.

మోతిలాల్ మంచి వ్యవహర్త, లోకజ్ఞాని అవడాన్ని స్వరాజ్య పేపరుకు విరాళం యిస్తానని కూడా అన్నారు. అంతే కాదు, ఆయన తన సెక్రటరీ రామస్వామి అయ్యంగారిని పిలిచి, నాకు రు 5000/- లకు ఒక చెక్కు ఇవ్వవలసిందని చెప్పారు. ఆయన ఇచ్చిన డబ్బు పేపరు కాతాకు జమ కట్టకపోతే లంచం క్రింద జమ అవుతుంది గనుక, ఆయన్ని ఆ అయిదువేల రూపాయల విలువగల వాటాలు తీసికోవలసిందని కోరాను. వాటాలు కొన్నట్లు ఆయనకు సర్టిపికేటు ఇచ్చాను. ఆమరణాంతం ఆయన వాటాదారుగానే ఉన్నారు.

మూసివెయ్యమని సలహా

గాంధీగారి విడుదల అనంతరం, ఆయన్ని నేను హాస్పిటల్‌లో కలుసుకున్నప్పుడు, ఆయనా నేనూ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. ఆ సందర్భంలో "స్వరాజ్య" పేపరు ప్రస్తావన వచ్చింది. తాను జైలులో ఉన్న రోజులలో, "స్వరాజ్య" చేసిన సేవను గురించి అడిగారు. తాను జైలుకు వెళ్ళిన తర్వాత దేశం పరిస్థితుల గురించి నన్ను ఏమి అడుగ లేదు. "పాలసీ"లో ఏమయినా మార్పు వచ్చిందా, వచ్చి ఉంటే యెందువల్ల వచ్చిందని కూడా నన్ను అడుగలేదు. ఎటువంటి ప్రశ్నలు వేయకుండానే, "స్వరాజ్య పత్రిక మూసేస్తే మంచి"దని సూచించారు. ఆ పలుకు నిజంగా నాలో సంచలనాన్ని కలిగించింది.

దేశం మొత్తంమీద కాంగ్రెసు "పాలసీ"కి కట్టుబడి కాంగ్రెసు కార్యకలాపాలను ఎప్పటికప్పుడు ప్రచురిస్తూన్న పత్రిక అది ఒక్కటే. గాంధీగారి కార్యక్రమ విజయానికి కూడా ఆ పత్రిక, ప్రారంభింపబడినది లగాయితు, ఎంతగానో సేవ చేసింది. పైగా ఆయన కార్యక్రమాదులనూ, విధానాలనూ ఖండించడంగాని, అ. భా. కాంగ్రెసు కమిటీ