పుట:Naajeevitayatrat021599mbp.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిరాకరణోద్యమ సంఘం అంటూ ఒక దాన్ని లేవదీశారు. తర్వాత, శాసన సభలను బహిష్కరించడం విషయమై అభిప్రాయ సేకరణ కంటూ ఇంకో ఉప సంఘాన్ని నియమింపజేశారు. ఆ తర్వాత, అఖిల భారత కాంగ్రెసు సంఘం వారిచేత శాసన సభా బహిష్కార విధానానికే తిలోదకా లిప్పించారు.

ఈ త్రివిధ పద్ధతుల మీద వారి బలగాన్ని నడిపించి, తాము పన్నిన వలలో రాజగోపాలాచారిగారు ఇరుక్కునేటట్లుగా చేశారు. ఈ దెబ్బతో గాంధీగారి సహకార నిరాకరణ విధానానికే స్వస్తి చెప్పించి, ఆ స్థానంలో శాసన సభా ప్రవేశ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు.

ఈ కథను పొడిగించే ముందు నాగపూరు జెండా సత్యాగ్రహ విషయం కాస్త చర్చించడం న్యాయం

10

నాగపూరు జెండా సత్యాగ్రహం:

ఆంధ్రదేశం నుంచి వాలంటీర్లు

లోగడ అలవాటయిన విధానంగా నాగపూరు వీథులలో తిరుగుతూన్న స్వచ్చంద సేవకుల్ని, కొన్ని కొన్ని వీథులగుండా యికముందు తిరుగ రాదంటూ 1923 మే మాసంలో 144 సెక్షను క్రింద ఆంక్ష విధించారు. జమన్ లాల్ బజాజ్ మున్నగు నాయకులు ఈ ఆంక్షను ఉల్లంఘించాలనే నిశ్చయంతో సత్యాగ్రహం ప్రారంభించారు. ఈ ఉద్యమానికి నాగపూరు జెండా సత్యాగ్రహం అన్నపేరు సార్థకం అయింది.

నిరుత్సాహ పరిస్థితులు

గాంధీగారి జైలుశిక్షా, దేశంలో స్వాతంత్ర్య సమరాన్ని అణగ ద్రొక్కడానికి ప్రభుత్వంవారు అవలంబిస్తూన్న పద్ధతులూ గమనించిన మధ్య పరగణా వాసులలో ఉత్సాహం నశించిన కారణంగా, కాంగ్రెసు