పుట:Naajeevitayatrat021599mbp.pdf/267

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లిక విరమణ'కి ఒప్పందం అయ్యాక, దాస్-మోతిలాల్ గారలు, తాము ఇంకా "నో చేంజర్స్"మేనని దబాయించలేరు గదా! "నో చేంజర్స్", "ప్రోచేంజర్స్" మధ్య సామరస్యం తీసుకువచ్చి, వారి మధ్యనున్న విభేదాలు విస్తరించకుండా చూడడమే మా క్రొత్త కక్షి ఆశయం. దానికి "సెంటర్-పార్టీ" అని నామకరణం జేశాము.

పై ఉదంతాల అనంతరం జండా సత్యాగ్రహం సాగుతూన్న నాగపూరులో, అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం (1923 జూలై) జరిగింది. ఆ మీటింగులో "సెంటర్-పార్టీ" స్థాపరులమయిన మా అందరిపైనా, నో ఛేంజ్ పక్షంవారు విరుచుకు పడ్డారు. సరోజనీదేవీ డా॥ అన్సారీ విమర్శించిన వారిని భావగర్భితమూ, సునిశితమూ అయిన తన ఉపన్యాసంతో చెరిగి విడిచి పెట్టింది. డా॥అన్సారీ అంత గుండె నిబ్బరం ఉన్న మనిషి కాకపోవడంచేత తనపై వచ్చిన విమర్శలకు తట్టుకోలేక నిజంగా మూర్చపోయాడు; ఆయన్ని మేమందరమూ కలిసి బయటికి మోసుకునిపోయి ముఖంమీద నీళ్ళు చల్లి, తెలివి వచ్చేదాక తంటాలు పడ్డాము. ఈ దెబ్బతో ఆయన భయపడిపోయి, తాను కొత్త పార్టీకి అధ్యక్షుడుగా ఉండ నిరాకరించాడు.

అనుకున్న ప్రకారం ముందు కార్యక్రమం జరిపించడానికి, అఖిల భారత కాంగ్రెసు సంఘ అధ్యక్షుడుగా కొండ వెంకటప్పయ్య పంతులుగారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సంఘంవారు శాసన సభలను బహిష్కరించడం విషయమై అభిప్రాయ సేకరణకుగాను ఒక ఉపసంఘాన్ని నియమించారు. దాస్-మోతిలాల్ గార్ల ప్రభకు తట్టుకోలేక, రాజగోపాలాచారిగారి నోచేంజ్‌పార్టీ శోభగోల్పోయిన పండుటాకులా ఎండి రాలిపోయింది. ఆచారిగారికి, ఏ విధంగా తమ శక్తుల్ని మళ్ళిస్తే, గాంధీగారి కార్యక్రమం పునరుజ్జీత మవుతుందో తెలుసు. ఆ రాజకీయ ధురంధురు లందువల్ల, గాంధీగారికి కుడి భుజం అనతగ్గ రాజగోపాలాచారిగారి మీద మొదటి బాణం విసిరారు. త్రివిధ బహిష్కార కార్యక్రమానికి రెండు మాసాలపాటు విరామం నీ వల్లనే కలిగిందన్నారు. తర్వాత, సత్యాగ్రహోద్యమాన్ని ఉద్ద్రుతం చెయ్యడానికి సహకార