పుట:Naajeevitayatrat021599mbp.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

డానే ఆయన అరెస్టవడానికి చూపించిన ఉత్సాహాన్నిచూసి పోలీసువారు ఆశ్చర్యపోయారు.

"గార్డ్ ఆఫ్ ఆనర్"

కమిటీవారు వచ్చేసరికి మేము వారిని పూలతోటీ, మాలలతోటీ కాదు ఆహ్వానించింది. వారి రాక సందర్భంలో గౌరవ పురస్పరంగా అరెస్టయిన మూడు వందలమంది వాలంటీర్ల గుంపే వారికి "గార్డ్ ఆఫ్ ఆనర్" అయింది. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమింప జేయాలనే ఉద్దేశంతో వచ్చిన "సివిల్ డిసొబిడియన్స్ ఇంక్వయిరీ కమిటీ" వారికి, గాంధీగారి ఉద్యమాన్ని ప్రోత్సహించి, అనుసరించాలని దేశీయులు ఎంతగా తహతహ లాడుతున్నారో వేరే సాక్ష్యం అవసరం లేకుండానే రుజువయింది.

నాటి సాయంత్రం విచారణ సంఘ నాయకులు ఒక బహిరంగ సభలో ఉపన్యసించారు. ఆ సభకు పూర్తిగా ఖద్దరు దారులయిన జనం సుమారు లక్షమందికి పైగా హాజరయ్యారు. సభానంతరం వారి వారి మకాములకు వారు చేరుకున్నాక, ఆ సంఘ సభ్యులే అయిన రాజగోపాలాచారిగారు, ఆ స్వచ్చంద సేవకులను ఎందుకు నిర్భంధించారో, సబ్-డివిజినల్ మాజిస్ట్రేటుగారిని అడగమని అన్నారు. మాజిస్ట్రేటుగారు జారీచేసిన ఆర్డరును వ్యతిరేకించిన కారణంగా వారిని అరెస్టు చేసినప్పుడు, ఆ విషయమై ప్రశ్నించడం అనవసరమూ, అర్థంలేనిదీ అని నేను చెప్పాను. ఇంకేవిధమయిన సంజాయిషీనీ సేకరించకుండానే ఆ సంఘంవారు ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. చివరకు వారి రిపోర్టులో దృక్పథాలలో తేడా లున్నాయని సూచించారు. రాజగోపాలాచారిగారూ, కస్తూరి రంగయ్యంగారూ, అందులో ఏ విధమయిన మార్పులూ చేయడానికి అంగీకరించలేదు.[1]

  1. ఈ విచారణ సంఘం తమ నివేదికను అఖిల భారత కాంగ్రెసు సంఘానికి సమర్పించింది. కలకత్తాలో ఆగష్టు(1922)లో జరగవలసిన అ.భా.కాం.సం. సభ నవంబరులో జరిగింది. శాసన సభా ప్రవేశ సమస్య గయా కాంగ్రెసుకు విడిచి వేసింది-ఈ సమావేశమే.