పుట:Naajeevitayatrat021599mbp.pdf/262

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాస్-మోతిలాల్‌గార్లు అంతకు పూర్వం దేశం నలుమూలలా పర్యటించి, తమ భావాలను ప్రజలతో చాటి చెప్పారు. దాన్తో దేశంలో చీలికలు ఏర్పడ్డాయి.

శాసనోల్లంఘన ఉద్యమ విచారణ

అంతేకాదు. అదే కాలంలో శాసనోల్లంఘన ఉద్యమ విచారణ సంఘం[1] అంటూ ఒక ఉపసంఘాన్ని వారు నియోగింపజేశారు. దేశంలో గాంధీగారి సహకార నిరాకరణ ఉద్యమం విజయవంత మయిందా లేదా అన్న సంగతి పరిశీలించి, దేశక్షేమం దృష్ట్యా ఆ ఉద్యమాన్ని సాగించడం మంచిదా లేక దానికి స్వస్తి చెప్పడం అవసరమా అన్న విషయాన్ని సమగ్రంగా తేల్చుకోవడానికి కావలసిన సమాచారాన్ని సేకరించవలసిందిగా ఆ సంఘానికి ఆదేశించారు.

అప్పటికే దేశీయు లందరికీ దాస్-మోతిలాల్ ప్రభృతులు గాంధీగారి విధానానికి విముఖులనీ, గాంధీగారు విడుదల అయ్యేలోపల, ఎల్లా గయినా ఆ విధానానికి స్వస్తిచెప్పడానికే నిశ్చయించుకున్నారనీ, విశదం అయింది. శాసనోల్లంఘన ఉద్యమ విచారణ సంఘాన్ని నియోగింప జెయ్యడం, గయా కాంగ్రెసు తీర్మానాన్ని వెనక్కి నెట్టించడం, అఖిల భారత కాంగ్రెసు సంఘంవారు 1-1-1923 న ప్యాసుచేసిన తీర్మానాన్ని రద్దు చేయించడం-ఒక దాని కొకటి తోడయి దేశీయుల హృదయాలలో కల్లోలాన్ని రేపాయి.

రాజగోపాలాచారిగారి బలహీనతవల్లనే ఇలాంటి పరిస్థితి ఉత్పన్న మయిందని అందరూ గ్రహించారు. గాంధీగారు బైటలేని కారణంగా, దేశానికి నో ఛేంజి, ప్రో ఛేంజి విధానాలలో ఏది ఉపయోగకరమయిన విధానమో తేలదని కాంగ్రెసు సేవకులు భావించారు. దాస్-మోతిలాల్ గార్లు తమ పార్టీ గురించి ప్రచారం చేస్తూ ఊరూరా తిరిగి ఉపన్యాసా

  1. గాంధీగారు నిర్భంధితు లయాక లక్నోలో జరిగిన అఖిల భారత కాంగ్రెసు సంఘ సమావేశం (1922 జూన్)లో