Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/251

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రత్యేకమైన సూచనలు ఇవ్వబడ్డాయి. సత్యాహింసలకు సదాబద్దులం అనే ప్రమాణాన్ని ప్రతి స్వయం సేవకుడూ విధిగా తీసుకునేవాడు.

1921 నాటి నిర్మాణాత్మక కార్యక్రమమూ, పిన్స్ ఆప్ వేల్స్ పర్యటన సందర్భంలో చూపించిన నిరసనాత్మక బహిష్కరణ విజయవంతం అవడానికి, యీ స్వయం సేవకులూ, వారి నిస్సార్థ నిరాడంబర సేవా, ఎంతగానో ఉపకరించాయి.

అలాంటి ఉపయుక్త సంస్థని విచ్చిన్నం చెయ్యడం పొరపాటున్నది ఈనాడు మన కందరికీ అవగాహన అవుతోంది. మత సామరస్యం కొరవడిన కారణంగానూ, ప్రస్తుతం జరుగుతూన్న యుద్ధం*[1] కారణంగానూ సంప్రాప్తమైన పరిస్థితులలో హిందూస్తాన్ సేవా దళంవారు ఎంతయినా సేవచేసి ఉండేవారు. బహుశా:వారు ఆనాడు ప్రభుత్వం వారికీ, కాంగ్రెసు వారికీ మధ్య ఉత్పన్నమైన చిక్కుల మూలంగా ఏర్పడిన ఎన్నో విపరీత పరిస్థితులను సవ్యంగా ఎదుర్కోగలిగేవారేమో కూడా.

8

చీరాల పేరాల ఉదంతం:

ఆంధ్రరత్న "రామదండు"

ఆంధ్ర దేశానికి సంబంధించి నంతవరకూ 1921 లో జరిగిన బ్రహ్మాండమయిన చరిత్రాత్మక సంఘటన ఇంకొకటి ఉంది. ఇది చాలా ముఖ్యమయినదీ, మరపురానిదీ. ఇది చీరాల పేరాల ఉదంతంగా బాగా ప్రసిద్ధి కెక్కింది.

చీరాలగ్రామం గుంటూరుజిల్లా కోస్తా ప్రాంతంలోనిది. అక్కడ జననమంది పేరుగాంచిన యోధానుయోధుడు ఆంధ్రరత్న దుగ్గిరాల

  1. *ద్వితీయ ప్రపంచ మహాయుద్ధం