Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉద్యమం దేశభక్త కొండ వెంకటప్పయ్య పంతులుగారూ, గొల్లపూడి సీతారామశాస్త్రిగారూ స్థాపించారు. వా రుభయులూ కలిసి 1922లో గుంటూరులో పన్నుల నిరాకరణ ఉద్యమం ప్రారంభించడంతో కాంగ్రెసు ఉద్యమం నూతన స్థాయిని అందుకుంది. వెంకటప్పయ్య పంతులగారు మంచి కీర్తి కెక్కిన హైకోర్టు న్యాయవాదిగా గుంటూరులో ప్రాక్టీసు చేస్తూ ఉండేవారు. ప్రజాసేవ చేద్దామనే సదుద్దేశంతో, గాంధీగారీ సత్యాగ్రహోద్యమానికి ఎంతో ముందుగానే ప్రాక్టీసు విరమించుకున్న పెద్దలువారు. వెనుకటి రోజులలో అ పాతకాలపు లెజిస్లేటివు కౌన్సిల్ లో సభ్యులుగా కూడా పనిచేశారు.

గాంధీగారి కాంగ్రెసు ఉధ్యమ ప్రారంభ దినాలలో నేనూ, వెంకటప్పయ్య పంతులుగారూ బెజవాడనుంచి గుంటూరు వరకూ కలసి రైల్లో ప్రయాణం చేయడం సంభవించింది, అ అవకాశాన్ని పురస్కరించుకొని వారిని కౌన్సిల్ సభ్యత్వానికి రాజీ యివ్వవలసినదని కోరాను. వారు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. నేను చాలా దూరం చెప్పాను. 1921 లోనూ, దరిమిలానూ కూడా వృత్తులను విరమించి ఉద్యమంలో జేరిన న్యాయవాదులను గురించీ ఉద్యమ ప్రాశస్తాన్ని గురించీ, ఎంతో వివరంగా చెప్పాను. నాప్రోద్బలం వల్ల ఆయన మనస్సు మార్చుకుని గాంధీగారి ఉద్యమంలో జేరడమే గాకుండా ఆయనకు ఎంతో సన్నిహిత శిష్యులయ్యారు. అంతేకాదు. కాంగ్రెసు కార్యనిర్వాహకవర్గ సభ్యులుగా ఎన్నికయిన ప్రథమ ఆంధ్ర సభ్యుడు ఆయనే. ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీ అధ్యక్షస్థానంకూడా మొదటిసారి ఆయన్నే వరించింది

ఉద్యమ నాయకులు

గొల్లపూడి సీతారామశాస్త్రిగారు కూడా గుంటూరులో మంచి పలుకుబడీ, ప్రాక్టీసూ ఉన్న హైకోర్టు న్యాయవాదే. ఆయనా, నేనూ కలసి కొన్ని జమీందారీ లావాదేవీలలో ఆ జిల్లాలోని సబార్డినేట్ కోర్టులలో పని చేశాము. వృత్తిలో ఆయన చాలా ఘనుడు. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెసు సంఘం ఏర్పడిన నాటినుంచీ ఆయనే దానికి ప్రముఖ కార్యదర్శి. గాంధీగారి "పిలుపు" ను మన్నించి, ఆయన న్యాయవాదవృత్తిని