పుట:Naajeevitayatrat021599mbp.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెట్టడానికి గాను మంజూరు చేశాం. అయితే రాజగోపాలాచారిగారు యేమయినా సరే సొమ్ము యివ్వనని బిగుసుకు కూర్చున్నారు. దాస్, మోతిలాల్ గార్లకు వ్యతిరేకంగా "నో చేంజర్స్" (శాసన సభా బహిష్కార వాదులు) పార్టీకి నాయకునిగా రాజగోపాలాచారిగారిని నిలబెట్టి, వారికి యెంతో మద్దత్తు ఇచ్చాను. కాని నాకు రాజగోపాలాచారిగారితోనూ, వారి పద్దతులతోనూ పరిచయం తక్కువ అవడాన్ని వారి వింత ప్రవృత్తి నాకు అర్థంకాలేదు. బాధితులకు పంచిపెట్టడానికి యివ్వవలసిన అ పదివేలరూపాయలూ వెంటనే మాలవ్యాగారికి యివ్వకపోతే, ఆయనా, అబుల్ కలాం అజాద్‌గారూ "నో ఛేంజి" దృక్పథానికి మార్తారని వారి అంచనా. నిర్బందానికి పూర్వమూ, నిర్బందానంతరమూ కూడా అజాద్ దాస్‌గారికి కావలసిన ముఖ్య స్నేహితుడే. అటువంటి పరిస్థితులలో బాధితులకు పంచిపెట్టుటకు యివ్వవలసిన పదివేలు యివ్వకపోతే, అజాద్ మా "నో చేంజి" దృక్పథానికి ఎల్లా మారుతారని రాజగోపాలాచారిగారు వూహించారో నాకు అర్థం కాలేదు. కానీ నాటికీ నేటికీ కూడా బాధితులకు పంచిపెట్టాలనుకున్న డబ్బు, రాజగోపాలాచారిగారి చేతినుండి రానేలేదు. హిందూ-ముస్లిం విచక్షణ లేకుండా "బాధితుడు" అవునా కాదా అన్న దృష్టితోనే అ పదివేలూ పంచి పెట్ట దలచాం. కాని రాజగోపాలాచారిగారి కారణంగా యేమీ చెయ్యలేకపోయాం. ఏది ఏదయినా గాంధీగారిని నిర్బంధించిన కొద్ది రోజులలోనే జరిగిన ముల్తాన్ విప్లవం మా కందరికీ కనువిప్పు అయింది.

హిందూ మహమ్మదీయ మైత్రి మా ఆశయం అంటూ చాటుతూన్న కాంగ్రెసు అధినేత మహాత్మాగాంధీ నిర్బంధం జరిగిన తక్షణం మీరు నిలబెట్టిన అభ్యర్థిని కాంగ్రెసువారు ఎల్లా ఓడించారో చూచారా అంటూ "పీరు" కుటుంబీకులను రెచ్చకొట్టాలని "సానుభూతి" సాకుతో కొంత మంది స్వప్రయోజన పరులు ప్రయత్నాలు సాగించారు. కాని పీరు కుటుంబంవారు అప్పట్లో అట్టె పట్టించుకోకుండా ఆత్మనిగ్రహంతో శాంతం వహించారు. ఆర్నెల్ల తర్వాత జిల్లాబోర్డు ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక విషయంలో తిరిగీ అదే ప్రకారంగా "పీరు" అభ్యర్థి కాంగ్రెసువారి