Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యులుగా వ్యవహరిస్తూన్న మేము అప్పట్లో అ ముల్తాన్ తిరుగుబాటు సంభవించిన వెనువెంటనే ముల్తాన్ ప్రాంతం పర్యటించి, సంఘర్షణ కారణాలను పరిశీలింప సాగాము. ముఖ్యంగా నేను వర్కింగు కమిటీ మెంబరుగానేగాక "స్వరాజ్య" పత్రికా సంపాదకునిగా కూడా, సంఘర్షణకు కారణాలను క్షుణ్ణంగా పరిశీలించదలచాను. నిజానికి ముల్తాన్ సంఘటనకూ, మతోద్రేకాలకూ సంబంధమే లేదు. ముల్తాన్‌లో పురపాలకసంఘం అన్నది యేర్పడ్డ నాటినుంచీ, అక్కడ పేరు ప్రఖ్యాతలూ, పలుకుబడి ఉన్న "పీరు" కుటుంబంవారు పురపాలక అధ్యక్షస్థానానికి ఒక వ్యక్తిని సూచించడమూ, అ వ్యక్తే యేకగ్రీవంగా ఎన్నిక అవడమూ జరుగుతూ వచ్చింది కాని, అ సంవత్సరం ఒక హిందూ కాంగ్రెసువాదికి, పీరు కుటుంబీకులు నిర్ణయించిన మహమ్మదీయునికి మధ్య పోటీ జరగడమూ, అందు హిందూ కాంగ్రెసువాది నెగ్గడమూ సంభవించడంతో "పీరు" కుటుంబీకులకు చాలా అవమానం జరిగిపోయిందనే కారణంగా అక్కడ ఆ సంఘర్షణ జరిగింది.

చౌరీ చౌరా సంఘటన కారణంగా కాంగ్రెసువారు తమ ఉద్యమాన్ని విరమించడమూ, దొరికిందే సందుగా యుక్తియుక్తంగా వ్యవహరించిన లార్డ్ రీడింగ్ నేర్పరితనమూ కలిసి కాంగ్రెసులో చీలికలు తీసుకువచ్చాయి. దాస్, మోతిలాల్ ప్రభృతులు గాంధీగారినీ వారి సహకార నిరాకరణ విధానాన్నీ త్రోసిపుచ్చి అస్థానంలో "కౌన్సిల్ ప్రవేశ పదకాన్ని" అమలు జరపాలనే నిశ్చయానికి వచ్చారు.

చక్రవర్తులవారి వింత ప్రవృత్తి

నేనూ, చక్రవర్తుల రాజగోపాలాచారిగారూ కూడా వర్కింగు కమిటీ సభ్యులమే. అప్పుడే కలకత్తా జైలునుంచి విడుదల అయిన పండిత మదనమోహన మాలవ్యాగారూ, అబుల్ కలాం అజాద్ గారూ కూడా మాతోబాటు ముల్తాన్‌లో సమావేశమయిన కార్యనిర్వాహక సభలో పాల్గొన్నవారే. ముల్తాన్ బాధితులకు వలయు సహాయం చేసి తీరాలనే నిశ్చయించుకున్నాం పదివేల రూపాయలు బాధితులకు పంచి