వాతావరణంలో అనుకోకుండా నాటుకుంది. లక్నో ఒప్పందం మహాత్మాగాంధీ, తిలక్ మహాశయుల దీవనలు అందుకుని, 1921-22 సంవత్సరాలనాటికి సత్పలితాలను సాధించింది. ఈ హిందూ - మహమ్మదీయ సామరస్యబీజాలు 1917 లో హెచ్. ఇమాంగారి అధ్యక్షతను పుంజుకున్నాయి. 1918 లో బొంబాయిలో జరిగిన స్పెషల్ కాంగ్రెసు వారి ఆమోదాన్ని కూడ కట్టుకున్నాయి. అ తర్వాత కూడా ఏటేటా జరుగుతూ వచ్చిన వివిధకాంగ్రెసు సభలతో ఆమోదాలమీద ఆమోదాలు అ "లక్నో పాక్టు"కు అందుతూనే వచ్చాయి.
లక్నోపాక్ట్ అధారంగా ఉద్యోగాది హోదాలలో మెట్టుపై మెట్టు ఎక్కగలిగిన అనాటి ముస్లిం నాయకులు అంతటితో ఆగక ఇంకా ఉన్నతస్థాయిలోకి రావాలనీ, ఇంకా ఎక్కువ ఫలితాలను సాధించాలనీ ఆందోళన సాగించారు. ఏటేటా తమ ప్రయత్నాలను ఉద్దృతం చేస్తూ, లక్నోపాక్ట్‌లో తాము సాధించింది అత్యల్పమనీ, ఇంకా యింకా తమ హక్కులూ, హోదాలూ పెరగాలనీ వారు ఉత్తర హిందూస్థానంలో ఉర్దూ రచనద్వారా ప్రచారంచేసి ముస్లింలను రెచ్చకొట్టారు.
ఈ రచనల పరిణామమూ ఫలితాలూ వగైరాలన్ని "హిందూ-మహమ్మదీయ సంఘర్షణలు" అన్న శీర్షికలక్రింద ముల్తాన్‌లో జరిగిన 1922 నాటి హిందూ మహమ్మదీయ సంఘర్షణలను గురించి వ్రాస్తూ వివరించాను. ప్రస్తుతం, యీ విషయాన్ని మనకూ, ప్రభుత్వం వారికి మధ్య సాగుతున్న పోరాటంతో జతపరుస్తున్నాను. రక్తాన్ని చవిచూస్తూ, ఉద్యోగాది హోదాలకోసం ఉద్దృతంగా ప్రచారం సాగించ గలిగిన యోధులు, గాంధీగారి నిర్బంధంతో లక్నోపాక్ట్‌ను పున:పరిశీలన చేసి తీరాలని గట్టిగా పట్టుపట్టారు.
ముల్తాన్ సంఘర్షణ: నా దర్యాప్తు
నిజానికి మొట్టమొదటిదైన ముల్తాన్ సంఘర్షణ[1]మతద్వేషం కారణంగా ఉత్పన్నం కాకపోయినా అప్పట్లో అ రూపం దానికి అంటగట్టారు.
- ↑ 1922 లో