Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సఖ్య సాధన కాంగ్రెసువారి ఆశయమూ, మూలసూత్రమూ, పునాదీ అన్న సంగతి మన విరోధులు ఎరగంది కాదు గదా!

4

హిందూ-మహమ్మదీయ సాంఘిక సంబంధాలు

బెజవాడలో (విజయవాడలో) జరిగిన అఖిలభారత కాంగ్రెసు సమావేశమూ *[1]మహమ్మదాలీ, షౌకత్‌అలీల కృషీ, మహమ్మదీయ స్వచ్ఛందసేవకుల సేవా, ఆంధ్రరాష్ట్రంలోనే గాక అనేక రాష్ట్రాలలో హిందూ-మహమ్మదీయ ఐకమత్య సౌధ నిర్మాణానికి శంకుస్థాపన చేశాయి. డాక్టరు కిచులీనీ, అలీద్వయాన్నీ, "ఫత్వా" ఖైదీలనూ విడుదలజేసే పర్యంతమూ, రీడింగ్ ప్రభువు ప్రతిపాదించిన రాజీ సూచనలను పరిశీలించను అన్న గాంధీగారి తిరస్కృతితో స్వాతంత్ర్య సంపాదనార్థం దేశం యావత్తూ ఏ ప్రకారంగా ముందంజ వేస్తోందో ఆంగ్లేయులకు ఆకళింపయింది.

భారతదేశం స్వాతంత్ర్యం సాధించడంకోసం అవలంబించిన అహింసాత్మక విధానం తొలి ఘట్టాలలోనే సాధించిన విజయాలను ఏమాత్రం సౌమ్యదృష్టితో చూసివుండినా, కోట్లాది భారత ప్రజ స్వాతంత్ర్యంకోసం ఎంతగా తహతహలాడుతుందో బ్రిటిషువారికి అవగాహన అయివుండేది. కాని మన దురదృష్టవశాత్తూ బ్రిటిషువారు హిందూదేశంపట్ల అవలంబించిన రాజ్యతంత్రానికి సౌమ్యదృష్టి అనేది పూర్తిగా లోపించింది. లార్డ్ రీడింగ్‌వంటి వ్యక్తికికూడా యీ దేశం పట్ల, దేశీయులపట్ల న్యాయమైన దృష్టి లోపించిందనీ, కుతంత్రాలతోనే రాజీ ప్రతిపాదనలు ప్రతిపాదింపబడ్డాయనీ మాకు ఆకళింపయింది. దాస్, మోతిలాల్ గార్లు తాము గాంధీగారికంటె ఉన్నతస్థాయిలోనివారం

  1. *1921 మార్చి-ఏప్రిల్ నిర్మాణ కార్యక్రమ విషయమై త్రివిధ బహిష్కారాల మీద తీర్మానాలుచేసి, దేశ ప్రజలతో కాంగ్రెసు కార్యక్రమం జరిపించాలని ఈ సమావేశం ఆదేశం.