Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యయం అయింది.

సర్దార్ వల్లబాయ్ పటేలూ, గాంధీగారూ, వచ్చిన ప్రతినిధుల సుఖసౌకర్యాలను స్వయంగా పరిశీలించారు. తరతమ భేదాలూ, వ్యత్యాసాలూ లేకుండా పరిశీలించారు. కుల మత తారతమ్యాలు తలయెత్తకుండాను, పారిశుద్ధ్యాది నియమాలు కూడా తర తమ భేదాలకు తావియ్యకుండానూ, అందరూ ఆనందంగా ఒకే కుండలో నీళ్ళు ఒకేగ్లాసుతో త్రాగారంటే అందులో అతిశయోక్తి ఎంత మాత్రమూ లేదని ఒప్పుకు తీరాలి.

ఆహ్వాన సంఘాధ్యక్షుని ఉపన్యాసమే కాదు, అందరి ఉపన్యాసాలూ చాలా క్లుప్తంగానూ, సూటిగానూ ఉన్నాయి. నిజమే, ప్రత్యక్ష చర్యలు, అవలంబించడానికి సిద్ధమవుతూ ఉన్న పరిస్థితులలో ఉపన్యాసాలతో కాలం విలంబనం చేయడం అన్యాయం కదూ? చేతలకు సిద్ధపడుతూన్న పరిస్థితులలో మాటలకు తావేది? అప్పటినుంచీ కాంగ్రెసు అన్నది ఉత్తమమయిన వ్యాపార కేంద్రంగా తయారయింది. ఉపన్యాసాలతో ఆడంబరమూ, ధీమా, ఉత్ప్రేక్షాది అలంకారాలూ, అనవసర సమాసాల దొర్లింపులూ లేవు. ఉన్నదంతా ఇల్లా ఇల్లా చెయ్యి, కార్యంసాధించుకురా అన్న ఆదేశమూ, ప్రోత్సాహమూ, మాత్రమే.

నాయకుల నిర్భంధాలు

అప్పటికే, ఈ దేశాన్ని చూడడానికి రానున్న ప్రిన్స్ ఆప్ వేల్స్‌ను (Prince of wales) బహిష్కరించాలి, ఆయన పర్యటన సరిగా సాగనివ్వకూడదు అన్న ప్రతిపాదనలు ఆమోదింప బడడం చేత దేశంలో నలుమూలలా ఉన్న ముఖ్య కాంగ్రెసు నాయకుల నందరినీ నిర్బంధంలోకి తీసుకోవడం జరిగింది. నిర్మాణ కార్యక్రమం విషయంలో అవలంబించతగ్గ మార్గాలన్నీ నిర్ణీతమయ్యే ఉన్నాయి. నిర్ణీతమయి ఉండడం యేమిటి, అమల్లోకే వచ్చేశాయి.

చిత్తరంజన్‌దాస్‌గారిని [1] అప్పటికే ఖైదుచేసి ఉండడంచేత

  1. 'ప్రిన్స్ ఆప్ వేల్సు' బహిష్కారోద్యమం సందర్భంలో వంగరాష్ట్ర పభుత్వం స్వచ్చంద సైనికుల్ని చేర్చడం క్రిమినల్ లా సవరణ చట్టానికి విరుద్ధమని ప్రకటించింది. సి. ఆర్. దాస్‌గారిని భార్యాపుత్రులతో సహా నిర్బంధించారు.