Jump to content

పుట:Naajeevitayatrat021599mbp.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాలయంలో బాలురకు కేవలమూ వడకడమూ, నేయడమే గాక, ఇతరవిధములైన చేతిపనులనుకూడా నేర్పేవారు. అచ్చటి పారిశ్రామిక విభాగంలో ముఖ్యంగా చెంచాలూ, చాకులూ, మంగలికత్తులూ మున్నగు సామానులేగాక తాళాలూ, తాళంకప్పలూ వగైరాకూడా తయారు చేసేవారు. పై రెండు సంస్థలూ నా సొంత బాద్యతమీదా, పర్యవేక్షణక్రిందా నడపబడుతూ ఉన్నా, గోపాలశాస్త్రిగారి ఖాదీ ఉత్పత్తి కేంద్రం దేశ మొత్తానికి ముఖ్యకేంద్రం అయింది.

పంచాయతీ కోర్టుల స్థాపన

పంచాయతీలు కోర్టులు అనేక గ్రామాలలో నెలకొల్పాము. అవన్నీ ప్రతిభావంతంగానే పనిచేశాయి. ఇట్లు ఆంధ్రప్రాంతంలో ప్రారంభింపబడిన నిర్మాణాత్మక వ్యాపంగాలన్నీ 'తిలకు స్వరాజ్యనిధి' పైనే ఆధారపడలేదు. భారతావని మొత్తంమీద అనేకప్రాంతాలలో బయలుదేరిన నిర్మాణ కార్యక్రమ కేంద్రాల స్థాపనకే వసూలయిన కోటి రూపాయలూ సముద్రంలో కాకిరెట్ట అనిపించాయి. కూర ఖర్చు కయినా చాలచేదన్నమాట. ఆ ఒక్క సంవత్సరంలోనే యావత్తు భారతావనిలోని కాంగ్రెసు అభిమానుల, సేవకుల సొంతజేబులనుండి అటువంటి కోట్లు ఎన్ని ఖర్చయ్యాయో! ఒక్క యేడాదిలోనే స్వరాజ్యం వచ్చి తీరుతుంది అనే నమ్మకంతో ప్రజలు ఎటువంటి త్యాగాలకయినా సంసిద్ధులయ్యారు. అనేక గ్రామాలలో పంచాయతీలు, దేశీయ విద్యాలయాలు, ఖాదీ ఉత్పత్తికేంద్రాలు స్థాపించాం. అంటరానితనాన్ని నిర్మూలించడానికీ, హిందూ మహమ్మదీయ సఖ్యం సాధించడానికీ వెలలేని కృషి జరిపాము.

ఈ నిర్మాణాత్మక కార్య సంరంభమూ, దేశం మొత్తంమీద సాదించిన విజయాలూ చూస్తుంటే ఎటువంటివారికయినా ఏడాది తిరిగే నాటికల్లా నూతన రాజ్యాంగ తంత్రాన్ని నెలకొల్పి, బ్రిటీషు పరపాలనా యంత్రాన్ని త్రోసిపుచ్చి, వారికి పోటీగా ఇంకో ప్రభుత్వాన్ని సాధించి, నడిపించగల శక్తి మనకుంది అనే ధీమా, విశ్వాసమూ కుదిరాయి. త్రివిధ బహిష్కరణ విధానాన్నీ, నిర్మాణ కార్యక్రమాన్నీ, నడిపిస్తూన్న