పుట:Naajeevitayatrat021599mbp.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాగపూరు కాంగ్రెసులో సహాయ నిరాకరణోద్యమం అవలంభించి కోర్టులూ, స్కూళ్ళూ, శాసనసభలూ బహిష్కరించ వలసినదనీ, నిర్మాణకార్యక్రమం ఒక్క సంవత్సరం పూర్తిగా దేశంలో అంతటా సాగించి జయప్రదం చేయవలెననీ, తిలక్ స్వరాజ్యనిధి పేరుతో సంవత్సరంలోగా కోటి రూపాయలు వసూలు చెయ్యవలసిందనీ, దేశం అంతటా 20 లక్షల రాట్టాలు ప్రవేశపెట్టి నూలు వడికేటట్టు చెయ్య వలసిందనీ తీర్మానించ బడింది. నిర్మాణకార్యక్రమంలో 1. జాతీయ పాఠశాలలు, 2. ఎక్కడ తగువులు అక్కడనే పంచాయతీ కోర్టులద్వారా పరిష్కారం చెయ్యడం, 3. ప్రభుత్వంమాదిరిగా కాంగ్రెసు నడిపించడం, 4. నియమాల ప్రకారం రాష్ట్రీయ కాంగ్రెస్ కమిటీలు, జిల్లా కాంగ్రెస్ కమిటీలు, తాలూకా కాంగ్రెసు కమిటీలు, గ్రామ కాంగ్రెసు కమిటీలు స్థాపన చేసి కాంగ్రెసు ప్రభుత్వం నడిపించడం మొదలయినవి ఉన్నాయి. నాగపూరు కాంగ్రెసు తరవాత 1921 వ సంవత్సరంలో బెజవాడలో అఖిలభారత కాంగ్రెసు కమిటీ సమావేశమై పైన చెప్పిన నిర్మాణ కార్యక్రమం విషయమై త్రివిధ బహిష్కారాలమీద తీర్మానాలు చేసి, దేశంలోని ప్రజలకి కాంగ్రెసు నిర్ణయించిన ప్రకారం కార్యక్రమం జరపవలసినదని ఆజ్ఞాపించింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. అది వరకు 30 సంవత్సరాలనించి, కాంగ్రెసు మహాసభ పనిచేస్తూ ఉన్నప్పటికీ, ఇల్లాంటి కాంగ్రెసు నియమావళికింద 1921 వ సంవత్సరం వరకు పనిచెయ్యలేదు.

నిర్మాణ కార్యక్రమం ఇప్పుడు ఏర్పరచబడిన పద్ధతిమీద అది వరకు ఎప్పుడూ ఏర్పరచలేదు. ఆంధ్ర రాష్ట్రము, తమిళ రాష్ట్రము, మళయాళ రాష్ట్రము, కన్నడ రాష్ట్రము మొదలయిన భాషాప్రయుక్త రాష్ట్రాలుగా విభజనచెయ్యడం కూడా నాగపూరు కాంగ్రెసులోనేజరిగింది.

మద్రాసు నగరము తెలుగు నగరము. ఇది చంద్రగిరిరాజు పరిపాలనలో ఉండేది. ఈ చంద్రగిరిరాజే దీనిని బ్రిటిష్‌వారికి స్వాధీనం చేశాడు. బ్రిటిష్‌వారికి స్వాధీన మైనప్పుడు తెలుగు జిల్లాలలో ఉండే