పుట:Naajeevitayatrat021599mbp.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయ్యాడు. ఇతర బ్రాహ్మణేతర నాయకుల్లో చాలామంది కాంగ్రెస్ అభిమానులే. అంతకుపూర్వం కాంగ్రెస్సు నాయకుల రాజకీయ జీవితానికి ఒక మెట్టుగా ఉండేది. ఇల్లా మెట్లెక్కినవారిలో ఎక్కువమంది అయ్యర్లు, అయ్యంగార్లే. అందుచేత ఈ బ్రాహ్మణేతరోద్యమం ప్రారంభం అయింది. దానికి బ్రాహ్మణులైన కొందరు రాజనీతిజ్ఞుల సంకుచితదృష్టికూడా సహాయపడింది. మాటవరసకి వ్రాస్తున్నాను. బ్రాహ్మణేతర నాయకులు ప్రత్యేక నియోజక వర్గాలు కోరారు. నూటికి 97 గురు ఉన్న బ్రాహ్మణేతరులు ప్రత్యేక నియోజకవర్గాలు కోరుకోవడమే ఒక అవ్యక్తపు పని! దాన్ని ప్రతిఘటించిన రామచంద్రరావు పంతులు, కస్తూరి రంగయ్యగార్లు ఆ పక్షపు అవశ్యకత సమర్ధించిన వాళ్ళు అయ్యారు.

25

కలకత్తా కాంగ్రెస్ (1917)

కలకత్తాలో 1917 లో బిసెంటమ్మ అధ్యక్షతకింద జరిగిన కాంగ్రెస్‌కి నేనూ హాజరు అయ్యాను. ఆ సంవత్సరంలో బిసెంటమ్మ చేసిన ఆందోళనా, తత్ఫలితంగా ఆమెకి ఇచ్చిన మన్నింపూ ఏకమై ప్రజలలో ఆమెకి ఉన్న పలుకుబడి బాగా వృద్ధి చేశాయి. తత్ఫలితంగా ప్రజల చేతిలో ఉన్న మహత్తర పదవి అయిన కాంగ్రెస్ అధ్యక్షత ఆమెకి లభించింది. బిసెంటమ్మ రాజకీయ తీవ్రత ఆమె విడుదలతోనే కొంచెం మార్పు చెందిందని అనేవారు. తరవాత విషయాలని బట్టి చూస్తే ఆ సంగతి నిర్ధారణ అయింది.

చిత్తరంజన్‌దాస్ కలకత్తా కాంగ్రెసునాటికి బాగా రాజకీయాల్లో ప్రవేశించాడు. యువకుల్లో ఆయనకి బాగా పలుకుబడి ఉండేది. అంత