పుట:Naajeevitayatrat021599mbp.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దేశానికి క్షేమం కాదని రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. కాని, సాగలేదు. చివరికి గోఖలే అనంతరం ఈ ప్రయత్నం కొంతవరకు సాగి లోకమాన్యతిలక్ ప్రభృతులు కాంగ్రెస్‌లోకి రావడానికి అవకాశం ఏర్పడింది. 1919 వ సంవత్సరంలో లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో ఈ పునస్సమ్మేళనం జరిగింది. కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక మహాఘట్టం. నేను మహమ్మదీయుల ఆందోళనను గురించి ఇది వరకే వ్రాశాను. మహమ్మదీయులు ఆనాటి కాంగ్రెస్ రాజకీయాలద్వారా ప్రభుత్వ ప్రాపకం పొందుతూ వచ్చిన హిందువులకి పోటీగా ప్రత్యేక ఎన్నికస్థానాలూ, ప్రత్యేకోద్యోగాలూ కావాలనీ ఆందోళన ప్రారంభించారు. 1919 లో ముస్లింలీగుకీ, కాంగ్రెస్సుకీ ఒక రాజీ జరిగింది. లోకమాన్యుడు మహమ్మదీయులకి ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని అన్నాడు. తాత్కాలికంగా హిందూ ముసల్మానులకి ఈరాజీ జరిగినప్పటికీ దూరదృష్టితో చూస్తే యీ రాజీయే మన రాజకీయమైన అనైకమత్యానికీ, పతనానికి మూలకారణం అయిందని నా అభిప్రాయము. మనల్ని నేటివరకూ హింస పెడుతూన్న ప్రత్యేక నియోజకవర్గాల సిద్ధాంతాన్ని ఆనాడు కాంగ్రెస్ అంగీకరించడంవల్లనే ఆ సిద్ధాంతం తాడుబారింది.

అప్పటి కప్పుడే భారత ప్రభుత్వం దేశంలోని రాజకీయాందోళకుల పోకడలు గమనించి, కొన్ని సంస్కరణలు ఇవ్వడంకోసం ఒక ప్రణాళిక తయారుచేసింది. కాంగ్రెస్సూ, లీగూ ఏకం అయి దానికి బదులుగా ఒక సంస్కరణ ప్రణాలిక తయారుచేసి పంపించారు. రాజకీయాల్లో అదే కాంగ్రెస్ లీగు ప్రణాళికగా ప్రసిద్ధిపొందింది. నేడు ఆ ప్రణాళిక చదివితే యీ నాటి స్వాతంత్ర్యాశయాలకి అది ఎంతగా కొరవడి ఉందో వేరుగా చెప్పక్కరలేదు. కాని, అక్కడికే ఆ సంస్కరణలు చాలా తీవ్రమైనవీ, అసంభమైనవీ అని చెప్పి తోసివేశారు.

జాతీయవాదుల పలుకుబడి హెచ్చడడంతో దేశంలో కలిగిన సంచలనం నన్ను ఆకర్షించింది. నేనుకూడా బిసెంటమ్మ హోంరూలు