పుట:Naajeevitayatrat021599mbp.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రతినిధులు ప్రెసిడెంటుని ఎన్నుకోవడంగాని ఏమీలేవు. మెహతా ఎవరిమీద కటాక్షవీక్షణం చేస్తే వాళ్ళే కాంగ్రెసు అధ్యక్షులు. తీవ్రవాదులైన తిలక్, లాలాజీలు ఆయన ఆగ్రహానికి గురి అయినవాళ్ళలో ముఖ్యులు. వాళ్ళకి దేశంలో ఎంత పలుకుబడి వున్నా, ఎంత గౌరవంవున్నా కాంగ్రెసు అధ్యక్షులు కావడానికిగాని, తమ వాదన నెగ్గించుకోడానికిగాని ఎల్లాంటి అవకాశమూ వుండేదికాదు.

మితవాదులు 1907 వ సంవత్సరంలో సూరత్ కాంగ్రెస్‌కి కలకత్తాలో ప్రసిద్దన్యాయవాది అయిన రనవిహారిఘోషుని అధ్యక్షుణ్ణి చేశారు. ఈ ఎన్నిక ప్రతిఘటించాలని బాలగంగాధరతిలక్ ముందే నిశ్చయించు కున్నాడు. అ కాంగ్రెసుకి నాగపట్నంనించీ, మహారాష్ట్రంనించీ వచ్చిన ప్రతినిధులు సమస్తసన్నాహాలతోటి దిగారు. మద్రాసు నించి వి. కృష్ణస్వామయ్యరుగారు, జి. ఎ. నటేశనుగారు, యస్. దొరస్వామయ్యరు గారు, వి. చక్రయ్యచెట్టిగారు, సుబ్బారావు పంతులుగారు, యింకా కొందరమూ ఈ కాంగ్రెస్సుకి హాజరు అయ్యాము. అందులో కృష్ణస్వామయ్యరుగారు, సుబ్బారావు పంతులు, నటేశన్ ప్రభృతులు మితవాద పక్షీయులు. దొరస్వామయ్యరుగారు అప్పట్లో యస్. శ్రీనివాసయ్యంగారి దగ్గిర లా ఎప్రెంటిస్‌గా వుంటూవుండేవారు. ఆయనా, చక్రయ్యచెట్టిగారూ అతివాదులు. అతివాదుల ఆదర్శాలు అంటేనే నాకు యిష్టం.

సమావేశ ప్రారంభంలో మితవాదులు రాస్‌విహారీఘోష్‌ని అధ్యక్షుణ్ణిగా సూచించారు. వెంటనే లోకమాన్యుడు వేదికమీదినించి లేచి లాలా లజపతిరాయ్ పేరు సూచించాడు. అప్పటికి 22 సంవత్సరాలనించీ మానవమాత్రుడు ఎవ్వడూ అల్లాంటి సాహసం చేసి వుండలేదు. కాంగ్రెస్ నియంత అయిన మెహతా అభిప్రాయానికి వ్యతిరేకంగా అధ్యక్షుడి విషయంలో మరి ఒక సూచన రావడమే అలజడి కలిగించింది!

నేనూ, వి. కృష్ణస్వామయ్యరుగారూ వేదికకి ముందుగా కూర్చుని వున్నాము. అ పక్కనే తిలక్ ముఖ్య స్నేహితుల్లో ఒకడైన కపర్ది