పుట:Naajeevitayatrat021599mbp.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జేసి, తమ విద్యా పద్ధతీ, న్యాయ పద్ధతీ ప్రవేశింపచేశారు. క్రమంగా తమ భాష, నాగరకత, సంప్రదాయాలూ, సంస్థలూ, ఆర్థికపద్ధతులూ, గ్రామ పాలనా సంస్థలూ మొదలైనవి మనకి అంటగట్టి, పూర్తిగా తమకి వశ్యుల్ని చేసుకున్నారు. కాంగ్రెస్ స్థాపింపబడే రోజులకే ఆంగ్లేయుల ప్రయత్నాలు చాలావరకు ముగిశాయి.

పల్లెలలో అనాదిసిద్ధంగా ఉండే విద్యాపద్ధతులు అంతమై, ఎలిమెంటరీ, ఎయిడెడుస్కూళ్ళు, బయలుదేరాయి. క్రమంగా, ఆవిద్య అనేది లేని ఈ పుణ్యభూమిలో అక్షరాస్యులు అరుదై పోయిన కాలం వచ్చింది. పాశ్చాత్య విద్యావిధాన ప్రవేశమే మనజాతి కంఠానికి తగిలించిన మొదటి గుదిబండ. దానికి తమ పరిపాలన సాగించడానికి ఏర్పరచిన లాకోర్టులు రెండో గుదిబండ. వీటిలోనించే లెజిస్లేటివ్‌కౌన్సిళ్ళు అనే భాధ్యతలేని బూటకపు సంఘాలు బయలుదేరాయి. సహజంగా ఇంగ్లీషు వారి విద్యావిధానంలో నించి తయారైన లాయర్లూ, సివిల్ నౌఖరులూ ప్రజలకి నాయకులు అయ్యారు. అల్లాంటి నాయకుల యాజమాన్యంలో సృష్టించబడిన ఈ కాంగ్రెస్ మహాసంస్థ ఆ దాస్య చిహ్నాలన్నీ వదులుకుని నేటికి గాంధీజీ చలవవల్ల నిజమైన ఏకైక జాతీయ సంస్థగా పరిణమించడం మనకి శుభావహం. అ విషయమై ముందుముందు వ్రాస్తాను. ప్రస్తావన మధ్యలో ఆంగ్ల విద్యాపద్ధతి విమర్శకి వచ్చింది.

కనక బర్మాలో ఆంగ్లేయులు చేసిన పనికూడా వ్రాస్తాను. నేను 1929 లో బర్మా వెళ్ళినప్పుడు ఒక విషయం తెలిసింది. ఆంగ్లేయులు తీబారాజుని పదచ్యుతుణ్ణి చేసి, ఖైదులో వుంచేసరికి, బర్మాలో నూటికి 80 మందికి తక్కువ గాకుండా విద్యావంతులు వుండేవారట. ఆంగ్లేయులు బర్మాని పూర్తిగా వశపరుచుకున్న 50 ఏళ్ళ లోపుగా ఆంగ్ల పాఠశాలలు స్థాపించి, జాతీయవిద్యావిధానాన్ని నాశనం చేసి, దేశంలో విద్యాగంధం ఉన్నవారి సంఖ్య సగానికి పైగా తగ్గించగలిగారు. బర్మాలో విద్యావిధానం అంతా బౌద్దసన్యాసులచేతుల్లో వుండేది. వారు స్థాపించిన మఠాల్లో ప్రజలకందరికీ ధర్మార్థకామాలు సిద్ధింపజేసే మహత్తరమైన విద్య లభించేది. ఆ మఠాలు ఇంగ్లీషు పాఠాశాలలు వచ్చాక