పుట:Naajeevitayatrat021599mbp.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బారిష్టరుగా పేరుప్రతిష్ఠలు వచ్చి జీవితపు అంతస్తు పెరగడంతోనే ఇంట్లో ఎవరికి ఏ చిన్నజబ్బు వచ్చినా, నేను పెద్దపెద్ద ఎక్స్‌పర్టుల్ని పిలిచే స్థితిలో పడ్డాను. నాకు ఖూన్ తొట్టివైద్యంమీద నమ్మకం ఉందికాని ఈ హోమియోపతీ అంటే ఇష్టం వుండేది కాదు. ఇంత శ్రమపడి అల్లోపతీ చదువుకుని జానకిరామయ్య హోమోపతీ ప్రాక్టీసు చెయ్యడం నాకు యిష్టంగా ఉండేదికాదు. అందుచేతనే నా తమ్ముడు వైద్యుడైనా నా యింట్లో వైద్యం యితరుల చేతిమీదుగానే జరుగుతూ ఉండేది.

ఒకసారి బహుశ: 1921 సంవత్సరంలో అనుకుంటాను - నా పెద్దకొడుకు నరసింహానికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దానికి కేశవపాయి వైద్యం చేస్తూవచ్చాడు. కాని వ్యాధి స్వాధీనం కాలేదు. ఆ కుర్రవాడి చెవిలోనించి చీము వచ్చేది, అందుచేత అప్పట్లో చెవి వైద్యంలో ఘటకుడైన శంకరనాదం పిళ్లెచేత వైద్యం చేయించాను. తాత్కాలికంగా చీము కట్టింది కాని, అసలు రోగం నివృత్తి కాలేదు. దాని తరవాతే టైఫాయిడ్ జ్వరం. వైద్యులు కడుపులో జబ్బుకి చికిత్స చేస్తూవచ్చారు. రోగి కాళ్లూ, చేతులూ కొట్టుకుంటూ నిస్పృహగా ఉండడంచేత జానకిరామయ్య అది మెదడుకి సంబంధించి ఉంటుందని చెప్పాడు. కాని అతనిమాట నేనుగాని, చికిత్సచేసే వైద్యుడుగాని వినిపించుకోలేదు. చివరికి రోగి బ్రతకడని పరమేశ్వరుడిమీద భారం వేసే స్థితికి వచ్చాక, జానకిరామయ్య వైద్యం చేశాడు. ఆ జబ్బు సప్రెషన్ ఆఫ్ డిస్‌ఛార్జివల్ల సంభవించి ఉంటుందని ఊహించి, దానికి రస సంబంధమైన హోమియోపతి మందు ఒక్క మోతాదు యిచ్చాడు. దానికి సంబంధించిన పుస్తకాలలోని విషయాలు అన్నీ నాకు చదివి వినిపించాడు. ఆ మందుతో రెండుచెవులనించీ రసి కారి, దానికి దారి చాలక ముక్కునించికూడా రసి వచ్చింది. అప్పుడు శంకరనాదంపిళ్లె సహాయంతో ముక్కూ చెవులూ శుభ్రపరిచాడు. రోగం మళ్ళింది. కాని నాలిక స్తంభించిపోయింది. చెవులు వినిపించడం మానేశాయి. ఆ స్థితిలో నేను కలకత్తా ఆలిండియా కాంగ్రెసు కమిటీకి పోవలసివచ్చి