పుట:Naajeevitayatrat021599mbp.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేను ఫస్టు క్లాసులోనూ, ఆయన సెకండు క్లాసులోనూ ఉండడంచేత కలుసుకోవడానికి వీలు అయ్యేదికాదు. కాని, అప్పుడు క్రిస్టమస్‌పండుగ అవడంచత ఆయన్ని ఓడలో కలుసుకున్నాను. విచారణ ఆయన ఎదటే జరిగింది.

నేను ఇంగ్లాండులో ఉన్నప్పుడు ఆలాంటిదే ఒక కేసు జరిగింది. ఒక యువతి డ్రస్సింగుగదిలో ఉండగా కాస్త వయస్సు ముదిరిన ఫాదిరీ ఆ గదిలో కొన్నినిమిషాలు ఉన్నా డన్న కారణంచేత ఆయన మీద వ్యభిచారనేరం ఆరోపించారు. అది తండోపతండాలుగా ప్రేక్షకుల్ని ఆకర్షించిన కేసు! ఫాదిరీ తాను ఏవిధమైన అపచారమూ చెయ్యలేదనీ, ఆమెతో మాట్లాడడానికి మాత్రమే ఆ గదిలోపల ఉన్నాననీ వాదించాడు. కోర్టువారు ఆ డ్రస్సులో ఒంటరిగా ఉండేటప్పుడు ఆమెతో ఒక గదిలో ఉండడమే నేర మని నిర్ణయించి ఆ ఫాదిరీని శిక్షించారు.

వీరేశలింగంగారి కేసు కూడా ఇల్లాంటిదే. ఆయనమీద ఆమె ఏకాంతంగా ఉండగా పంతులుగారు ఆమె వీపు నిమురుతూ ఉండే వారనీ, బెంగుళూరు ప్రయాణంలో సెకండు క్లాసు కంపార్టుమెంటులో ఉభయులూ ప్రయాణం చేశారనీ, బెంగుళూరులో ఇద్దరూ మూడు మాసాలు ఒక గదిలోనే ఉన్నారనీ నిందారోపణ చేశారు. "మంగమ్మని నా అభిమాన పుత్రికగా చూసుకునే వాణ్ణి," అని వీరేశలింగంగారి వాదన. పాపం! వీరేశలింగం పంతులుగారిని సుమారు 5 రోజులు క్రాసుపరీక్ష చేసి ఈ పై సంగతులన్నీ ఒప్పించాను. ఆ ఇంగ్లీషు కేసు నాధారంగా చేసుకుని నా వాదన అంతా ఆ పద్ధతులమీద నడిపించాను.

ఒక పత్రికా రచయిత, తనకి న్యాయం అయినదని తోచే విమర్శన చెయ్యడానికి తగిన అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో మేజస్ట్రీటుకి ఒక నిశ్చయం కుదిరింది. అందుచేత మేజస్ట్రీటు "ఈ కేసు ఎందుకు కొట్టివెయ్యకూడదో చెప్ప" మని అడిగాడు. పంతులుగారు "కేసులో వాదించడానికి మద్రాసునించి ఎవ్వరో వస్తారు. అందాకా వాయిదా ఇ"మ్మని అడిగారు; కాని ఇవ్వలేదు. చివరికి మేజస్ట్రీటు కేసు కొట్టివేశాడు. స్టూ అర్టుకి ముందు, ఈ కేసు విచారించిన బార్ట్సువెల్