పుట:Naajeevitayatrat021599mbp.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము ఉభయులమూ పస్టుక్లాసులో రావాలని కృషిచేస్తూ ఉండేవాళ్ళము. ఈ దేశంలో 10 ఏళ్ళపాటు ప్రాక్టీసుచేసి ఉండడంవల్ల ఆ చదువులోతు అంతా బాగా తెలుసుకోవడానికి వీలయింది. నేను లెక్చర్లు శ్రద్ధగా వినడమే కాకుండా, వాటికి సంబంధించిన ప్రధాన గ్రంథాలన్నీ చదివాను. నేనూ, సర్కారుగారూ కూడా సర్టిఫికేట్ ఆఫ్ ఆనరు సంపాదించాలని కృషిచేస్తూ ఉండేవాళ్ళము. అది 50 పౌనుల బహుమానము. ఈ బహుమానమూ, ఈ గౌరవమూ రావాలంటే నూటికి 75 మార్కులు పైగా రావాలి. పైగా, నోటిపరీక్ష ఒకటి ఉంటుంది. దాన్నికూడా నిగ్రహించుకుని రావాలి.

ఆయన వేరే ఇన్‌కి చెందినవాడేగాని మేము ఇద్దరమూ స్నేహంగా ఉండేవాళ్ళము. ఆయన ఈక్విటీ పేపరు ఇచ్చిన (Straughn) స్ట్రాన్‌ని చూడడానికి వెళ్ళారట. ఆయన "ప్రకాశం పేపరు అన్నిటికన్నా ఉత్తమంగా ఉంది. అతన్ని ఒకసారి చూడాలి," అన్నాడట. అ సంగతి సర్కారుగారు నాతో చెప్పిన తరవాత నేను ఆయన్ని దర్శించడానికి కనిపెట్టుకుని ఉన్నాను. కాని, ఒకరోజున ఆయనే నా గదికి వచ్చి నన్ను అభినందించి వెళ్ళిపోయినారు. ఈ రీతిగా పరీక్షలు ముగించుకున్నాను.

పరీక్షలు ముగిసేటప్పటికి నా దగ్గిర ఆర్‌బత్‌నాట్ అనే అతను స్థాపించిన బాంకులో 500 రూపాయిలు ఉన్నాయి. ఆర్‌బత్‌నాట్ అనే అతను మద్రాసు ప్రెసిడెన్సీలో పెద్ద బాంకు ఒకటి నడిపించి, చాలా మంది డబ్బు సేకరించాడు. ఆ కంపెనీ దివాలా తీయడంతోటే చాలా మంది ఉద్యోగస్థులూ, సామాన్య సంసారులూ కూడా చాలా డబ్బు పోగొట్టుకున్నారు. వి. కృష్ణస్వామయ్యరుగారి డబ్బుకూడా కొంత పోయింది. అందుచేతనే ఆయన పట్టుదల వహించి ఆర్‌బత్‌నాట్‌ని ప్రాసిక్యూటు చేయించి, ఇండియన్ బాంకు స్థాపించాడు. ఆ ఆర్‌బత్‌నాట్ కంపెనీ శాఖే లండన్‌లో మాక్‌ఫిడెన్ కంపెనీ. ఇక్కడ బాంకు దివాలా తీయడంతోటే అక్కడ కంపెనీ బోర్డు కూడా తిప్పివేశారు. మాక్‌ఫిడెన్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అందుచేత మన