పుట:Naajeevitayatrat021599mbp.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

రాజమహేంద్రవరం రాక

అప్పటికి రాజమహేంద్రవరంలో వీరేశలింగంగారి ప్రభ బాగా వెలుగుతోంది. అప్పటికే సుబ్బారావుపంతులు ప్రభృతులు ఆయనకి విరోధులు అయ్యారు. వితంతు వివాహాలు ప్రోత్సహించిన సుబ్బారావు పంతులుగారు, తీరా తన తమ్ముడే కందుకూరివారి ప్రోత్సాహంచేత కొమ్మూరి నరసింహారావుగారి చెల్లెల్ని వివాహమాడేసరికి, పంతులు గారికి ఎదురు తిరిగి హిందూసమాజం స్థాపించారు. నూతన వైష్ణవానికి పంగనామాలు పెద్దన్నట్లు పంతులుగారి సనాతన హిందూధర్మం చాలా కరుడు గట్టింది. చివరికి ఆ సనాతన ధర్మం అంతా భయంకరంగా నా మీదికి తిరిగింది.

నేను ఇంగ్లండునించి వచ్చాక ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే కాని ఇంట్లో కలవడానికి వీలులేదన్నారు. నేను దానికి వల్లకాదన్నాను. మా తమ్ముడు శ్రీరాములు అప్పుడు వీరేశలింగంగారి శిష్యులలో ముఖ్యుడు. అతను ముందే వద్దని పట్టుపడ్డాడు. కందుకూరి వెంకటరత్నం, దామెర్ల రమణారావు ప్రభృతులు కూడా వద్దనే వాళ్ళలోవాళ్ళే, కొందరు మిత్రులు నేను తిరిగి వచ్చిన కొత్తరికంలో విందులు చేశారు. ఆ విందులో పాల్గొన్నవా ళ్ళందరికీ సంఘబహిష్కారం అన్నారు. ఈ బహిష్కారం గందరగోళంవల్ల నేను ఎక్కడ లొంగిపోతానో అని వీరేశలింగంగారికి బాగా ఆత్రతగా ఉండేది. అందుచేత ఆయన ఒకసారి నేను ధార్వాడ కృష్ణారావుగారి ఇంట్లో కూర్చుని ఉండగా వచ్చి నన్ను హెచ్చరించిపోయారు. బహిష్కరణ వాదులంతా ఒక సభ చేసి, నా విషయము, నాతో భోజనం చేసిన ఇతరుల విషయమూ గుదిగుచ్చి, శంకర పీఠాధిపతులైన రాణీచయనులు స్వాములవారికి ఫిర్యాదు చేశారు.

దానిమీద ఆయన నాకు ఒక రిజిస్టరు నోటీసు పంపించారు. సముద్ర యానం హిందూ మతానికి విరుద్దం కనక, తగిన ప్రాయశ్చిత్తం లేనిదే హిందూ సంఘంలో కలవ కూడదనీ, వెంటనే తన ఎదట హాజరు