పుట:Naa Kalam - Naa Galam.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాగ్‌ హమర్షెల్డ్‌ మృతి చెందగానే మీరు ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతిని ఎలా ప్రకటించారు? గాంధీ కొక న్యాయం, హామర్షెల్డ్‌కు ఒక న్యాయమా? నోబెల్‌ బహుమతుల వ్యవస్థాపకుడు ఆల్‌ ఫ్రెడ్ నోబెల్‌, హామర్షెల్డ్‌ - ఇద్దరూ స్వీడన్‌ దేశీయులైనందున, మీరు ఆయనకిచ్చారా?" అని ప్రశ్నించాను.

ఆ లేఖకు ఇప్పటికీ సమాధానం లేదు, అది ఎప్పటికీ రాదు కూడా! కాకపోతే, ఆ తరువాత వేరే సందర్భంగా నోబెల్‌ కమిటీ వారు గాంధీకి శాంతి బహుమతి ఎందుకు యివ్వలేదో సంజాయిషీ యిచ్చుకున్నారు. మొదటిది - ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలోనే (1939-45) నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ పేరు ప్రతిపాదించబడిందట. అప్పటిలో రెండు, మూడు సార్లు ఆయన పేరు పరిశీలనకు వచ్చిందట. అయితే, అప్పటిలో మహాత్మాగాంధి భారత స్వాతంత్య్రం కోసం బ్రిటీష్‌ సామ్రాజ్య వాద ప్రభుత్వంతో పోరాడుతున్నందున, అప్పుడు ఆయనకు శాంతి బహుమతి యిస్తే, బ్రిటీష్‌ ప్రభుత్వానికి అసంతృప్తి కలుగుతుందని శాంతి బహుమతి మహాత్మాగాంధీకి యివ్వలేదట! రెండవది-ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత గాంధీజీ మరణించారట. అందువల్ల, ఆయనకు నోబెల్‌ శాంతి బహుమతి యివ్వలేదట!

ఇదీ నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ కథనం! ఇందులో మొదటి సాకు - ఆ కమిటీ పిరికితనానికి, రాజకీయ ఒత్తిడికి సంబంధించినది. రెండవది - ఇంతకు పూర్వమే పేర్కొన్నట్టు - సర్వా బద్ధం. హమర్షెల్డ్‌కు ఎలాయిచ్చారు?

గాంధీకి నోబెల్‌ శాంతి బహుమతి విషయం అప్పటి రాష్ట్రపతి శ్రీ కె.ఆర్‌. నారాయణన్‌ దృష్టికి తీసుకురాగా, "ఎవ్వరూ లేవనెత్తని విషయాన్ని నోబెల్‌ కమిటీ దృష్టికి తీసుకువచ్చినందుకు" నన్ను అభినందిస్తూ లేఖ రాశారు! అప్పటిలో ఈ విషయాన్ని నేను పత్రికలకు విడుదలచేసినందున, అది అంతర్జాతీయ సమస్యగా పరిణమించి, మరెవరో దీన్ని ప్రస్తావించినందున,