పుట:Naa Kalam - Naa Galam.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


రాజీవ్‌ అన్నవీ, అనని వాటిని నేను కలిపి, నాదే ఒక ఉపన్యాసంగా చేశాను! ఇక, ఆ జన సందోహం ముందుకు రావడం మానివేశారు! నా ఉపన్యాసాన్నే రాజీవ్‌గాంధి ఉపన్యాసంగా ప్రశాంత నిశ్శబ్దంగా విన్నారు. సభ జయప్రదమైంది. సభాంతంలో శ్రీ రాజీవ్‌గాంధి "రావ్‌! యు హావ్‌ డన్‌ వెల్‌!" అంటూ అభినందించారు. శ్రీ సుభాష్‌ చంద్రబోస్‌, ఆయన బావ - రాష్ట్ర మంత్రి శ్రీ ఇందుకూరి రామకృష్ణంరాజు ఎంతో సంతోషించారు.

ఆ రోజు నా అనువాద ఉపన్యాస ఫలితం - ఆ తరువాత నన్ను రాష్ట్ర ప్రభుత్వం "గౌరవ సాంస్కృతిక మహావక్త" (ఒక విధంగా "ఆస్థాన ఉపన్యాసకుడు")గా నియమించింది!

గాంధీజీకి నోబెల్‌ బహుమతి?

1990 దశకం ప్రారంభంలో నాకొక ఆలోచన వచ్చింది. యుద్ధోన్మాదులు అమెరికా విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్‌ ప్రధాని వంటి వారికి నోబెల్‌ శాంతి బహుమతి యిచ్చారు. కాని, ప్రపంచ శాంతి దూత, శాంతియుతంగా, అహింసాత్మకంగా భారత స్వాతంత్య్రాన్ని సాధించిన మహాత్మాగాంధికి నోబెల్‌ శాంతి బహుమతి యివ్వకపోవడమేమిటి? అన్న ఆలోచన వచ్చింది.

వెంటనే స్వీడన్‌లోని నోబెల్‌ శాంతి కమిటీకి ఆ ప్రశ్ననే వేస్తూ లేఖ రాశాను.

వెంటనే నోబెల్‌ శాంతి బహుమతి కమిటీ డైరెక్టర్‌ నాకు లేఖ రాస్తూ "మరణించిన వారికి నోబెల్‌ శాంతి బహుమతి యివ్వడం లేదు. అందువల్ల, గాంధీజీకి యివ్వలేదు" అని జవాబు రాశారు!

ఇంకేమున్నది? నాకు దొరికి పోయారు! నేను తిరిగి ఆ డైరెక్టర్‌కు లేఖ వ్రాస్తూ "అలా అయితే, 1981లో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి