పుట:Naa Kalam - Naa Galam.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అయితే, ప్రక్కనే మరో స్టాండింగ్‌ మైక్‌ వద్ద వున్న నాకు కూడా ఆ మహాజన సంరంభంలో ఆయన ఉపన్యాసం వినిపించడం లేదు. ఉపన్యాసం వినకపోతే మానె, తమ ప్రియతమ నేత ఇందిరాగాంధి కుమారుణ్ణి దగ్గర నుంచి అయినా చూద్దామని జనం ఒక్కసారిగా వేదికవైపు దూసుకురాసాగారు!

ఇంకేమున్నది? సభ భగ్నమయ్యేట్టు కనిపించింది! ఆందోళనతో శ్రీ సుభాష్‌ చంద్రబోసు నా వద్దకు వచ్చి "కుటుంబరావు గారూ! ఇంత శ్రమపడి సభ ఏర్పాటు చేస్తే, ఇది కాస్తా భగ్నమైపోయింది! ఇక లాభం లేదు. ఆయన చెప్పేది ఎవ్వరికీ వినిపించదు, అర్ధం కాదు. మీరు తర్జుమా చేయడం ఆపి వేయండి, ఏమి జరిగితే అదే జరుగుతుంది" అన్నారు.

"బోసుగారూ! మీరు ఆందోళన పడకండి. ఈ సభ భగ్నమైతే, నేనెందుకు? మీరు అనువాదకుడుగా నన్ను తీసుకువచ్చింది సభ భగ్నం కావడానికా? చూస్తూ వుండండి - ఏమి జరుగుతుందో!" అన్నాను!

Naa Kalam - Naa Galam Page 82 Image 0001

శ్రీ రాజీవ్‌గాంధి యథా ప్రకారంగా ఉపన్యసిస్తున్నారు. నేనిక ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒక మాటను పట్టుకుని, దానికి కొన్ని చిలవలు, పలవలతో, మాటల గారడీతో, నా సహజ సిద్ధమైన శైలిలో గంభీరస్వరంతో,