పుట:Naa Kalam - Naa Galam.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేమో!" అన్నాను. శ్రీ మొరార్జీ చిరునవ్వుతోనే కొంచెం నిర్మొగ మాటంగా, కుండబద్దలుకొట్టినట్టు మాట్లాడుతారు.

"సభను రద్దు చేయడమెందుకు? సభకు ముందు ఒక సంతాప తీర్మానం చేద్దా"మని చెప్పారు. ఆయన సూచన ప్రకారం ఆరోజు సాయంత్రం సభ ఏర్పాటు చేశాము. శ్రీ జి.ఎస్‌. రాజు అధ్యక్షత వహించారు. నేను శ్రీ మొరార్జీ ఇంగ్లీషు ఉపన్యాసాన్ని తెలుగులోకి తర్జుమా చేయాలి.

ఆయన మాట్లాడుతుండగా, నేను రెండు, మూడు సార్లు "ప్లీజ్‌ రిపీట్‌" ("మళ్లీ చెప్పండి") అంటూ వచ్చాను. శ్రీ మొరార్జీకి చిరాకు వేసి, "నేను చెప్పేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు!" అంటూ కొంచెం వెటకారంగానే అన్నారు!

ఒక సభలో కాని, నలుగురి సమక్షంలో కాని నన్ను వెటకారంగా మాట్లాడినా, అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేసినా సహించే స్వభావం కాదు నాది. అవతలి వారు ఎంత గొప్ప వారైనా, నన్ను నలుగురిలో తక్కువ చేస్తే, నా లోని ఆత్మగౌరవం పెల్లుబుకుతుంది!

నేను వెంటనే "మీ ఉపన్యాసం నాకు అర్థం కాక కాదండీ! మీరు మాట్లాడుతుంటే, నా ప్రక్కనే కూర్చున్న పాత్రికేయ మిత్రుడు శ్రీ మల్లెల శ్రీ రామమూర్తి మీ ఉపన్యాసానికి తెలుగు తర్జుమా తానే ముందుగా నాకు అందిస్తున్నాడు. మరి, నేను మీ ఉపన్యాసాన్నే వినాలా? ఆయన పక్క తాళాన్ని ఆలకించాలా? రెండు ఉపన్యాసాలను ఒకే సారి వినడం సాధ్యంకాదు కదా!" అనేసరికి మొరార్జీ నవ్వారు; సభాసదులు హర్షధ్వానాలు చేశారు!

అలాగే ఒక సారి అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన రైతాంగనేత ఆచార్యరంగాతో నేను మాట్లాడుతుండగా, ఆ రోజు "ఆంధ్రపత్రిక"లో