పుట:Naa Kalam - Naa Galam.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(కొంచెం వ్యంగ్యంగా మాట్లాడ్డం ఆయనకు అలవాటు. లేకపోతే, ప్రధాని నెహ్రూకు నేను సిఫారసు చేయడమేమిటి?) కాని, నేనిప్పుడు అస్తమిస్తున్న సూర్యుణ్ణి. నాకిప్పుడు పదవులెందుకు?" అని ఆయన చమత్కరించారు. దాన్ని ఆ మరునాడు పత్రికలు ప్రముఖంగా "బాక్స్‌" కట్టి ప్రచురించాయి!

మొరార్జీ ఉపన్యాసానికి పక్కతాళం

1964 నవంబర్‌లో గుంటూరులో అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ సమావేశాలు జరిగాయి. ఆ సభలకు అనేక మంది కాంగ్రెస్‌ ప్రముఖులతోపాటు ఆ తరువాత 1977లో జనతాపార్టీ తరఫున దేశ ప్రధాని పదవిని అలంకరించిన శ్రీ మొరార్జీ దేశాయ్ కూడా హాజరైనారు. అప్పటికి ఆయన కామరాజ్‌ పథకం కింద కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించబడ్డారు! ఆయన గుంటూరు నుంచి విజయవాడ వచ్చి, అక్కడి నుంచి మరునాడు గన్నవరం నుంచి (విజయవాడకు 20 కిలో మీటర్లు) విమానంలో వెళ్లవలసి వుంది. ఆ నవంబర్‌లో - బహుశా 9వ తేదీ కావచ్చు - ఆయనను గుంటూరు నుంచి విజయవాడ తీసుకువచ్చే బాధ్యత నాపై పడింది. విజయవాడలో సిటి కాంగ్రెసు అధ్యక్షులు శ్రీ జి.ఎస్‌. రాజుకు ఆయన అతిథి.

శ్రీ మొరార్జీ విజయవాడ వచ్చిన తరువాత సిటి కాంగ్రెస్‌ తరఫున ఒక సభలో మాట్లాడాలి. ఆ రోజు సాయంత్రం గాంధీజీ మునిసిపల్‌ హైస్కూల్‌లో సభ ఏర్పాటు చేశారు.

సభ మరో గంటలో ప్రారంభమౌతుందనగా, ఏ.ఐ.సి.సి. ప్రధానకార్యదర్శి శ్రీ జి. రాజగోపాలన్‌కు ఏదో సుస్తీ చేసి, గుంటూరు జనరల్‌ ఆసుపత్రిలో ఆకస్మికంగా మృతిచెందినట్టు వార్త వచ్చింది. నేను వెంటనే ఈ వార్తను శ్రీ మొరార్జీకి చెప్పి, "మృతి చెందింది అఖిల భారత కాంగ్రెస్‌ కార్యదర్శి. సభను ఆయన మృతిపట్ల సంతాప సూచకంగా వాయిదా వేయడం సముచిత