పుట:Naa Kalam - Naa Galam.pdf/52

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మేమిద్దరం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డుల కమిటీలో ఒక పర్యాయం సభ్యులుగా పనిచేశాము. ఆ కమిటీకి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి చైర్మన్‌.

ఫిలిం పరిశ్రమతో సంబంధం

నేను మొత్తం ఏడు సార్లు నంది అవార్డుల కమిటీ సభ్యుణ్ణి. శ్రీ గోపాలరెడ్డి తరువాత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్రీ పి. జగన్మోహనరెడ్డి, ఆ పిమ్మట మాజీ ఆర్ధిక మంత్రి శ్రీ పిడతల రంగారెడ్డి ఆ కమిటీలకు చైర్మన్‌లుగా పని చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా దాదాపు 20 సంవత్సరాలు పని చేయడం వల్ల ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ చిత్రం వగైరాల ఎంపికలో కమిటీ చైర్మన్‌లు సహజంగా నా అభిప్రాయాలకు హెచ్చు ప్రాధాన్యమిచ్చే వారు. నేను నంది అవార్డుల కమిటీలతో పాటు ఒక సారి నంది టి.వి. ఫిలిం అవార్డుల కమిటీలో కూడా వున్నాను. ఈ కమిటీలకు ఒకసారి హైకోర్టు జడ్జిగాను, యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గాను పనిచేసిన జస్టిస్‌ రామానుజులు నాయుడు చైర్మన్‌గా పనిచేశారు.

ఆంధ్రప్రదేశ్‌ ఫిలిం ఫాన్స్‌ అసోసియేషన్‌తో నా సంబంధం వల్ల ఫిలిం పరిశ్రమకు నేను సన్నిహితుణ్ణి అయ్యాను.

ఆ అసోసియేషన్‌కు మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్రమంత్రి డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులు, నేను ప్రధాన కార్యదర్శిని. ఆ సంస్థకు ఆంధ్రప్రదేశ్‌లో 42 శాఖలుండేవి. ప్రతి సంవత్సరం ఫిలిం బ్యాలట్‌ పెట్టి, రాష్ట్రంలో ఏదో ఒక పట్టణంలో ఫిలిం అవార్డుల సభలను మహా వైభవంగా జరిపేవారం. విజయవాడలోను, మరికొన్ని నగరాలలోను జరిగిన సినిమా సభలన్నింటికి నన్ను అధ్యక్షుడుగా ఆహ్వానించేవారు. ముఖ్యంగా విజయవాడలో అయితే, ఇప్పటికీ - అంటే ఈ "స్వీయ కథ" రాస్తున్న 2010 వరకు అంటే అర్ధ శతాబ్దికి పైగా - విజయవాడలో జరిగిన సినిమా సభలన్నింటికీ నేనే