పుట:Naa Kalam - Naa Galam.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బయలుదేరారు. మేము ఆ రోజున అటు విజయవాడ నుంచి ఏలూరు వైపు, ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్లే కారులను, బస్సులను, లారీలను ఆపి, వాటిలో ఎవరున్నా "నెహ్రూ వెంటనే ఆంధ్రరాష్ట్రం ఇవ్వాలి", "పొట్టి శ్రీరాములు గారి ప్రాణాలు కాపాడలి" అంటూ నినాదాలు చేస్తే కాని, ఆ వాహనాలను కదలనివ్వడం లేదు!

అంతకు పూర్వం కొద్ది కాలం క్రితమే కొత్తగా వివాహమైన యువ సబ్‌ కలెక్టర్‌ శ్రీ టి. వేదాంతం (నూజివీడు) విజయవాడ నుంచి నూజివీడు వైపు కారులో సతీ సమేతంగా మెతున్నారు. మేము ఆయన కారు ఆపి, ముందు చెప్పిన నినాదాలు చేయవలసిందిగా కోరాము. మా మాట వినడం కొత్త భార్య ముందు తన అధికారానికి నామోషీగా తోచింది కాబోలు, ఆ యువ సబ్‌ కలెక్టర్‌ నినాదాలు చేయడానికి నిరాకరించారు! దానితో మేము కారు మరి ముందుకు వెళ్లడానికి వీలులేదని అడ్డంగా నిలబడ్డాము.

కోపోద్రిక్తుడైన ఆయన గన్నవరం విమానాశ్రయంలోని ఫోన్‌ వద్దకు వెళ్లి, మాపై ఫైరింగ్‌ ఉత్తరువు తీసుకువస్తానని బెదిరించారు! అయితే, మేమూ బెదరలేదు. ఫైరింగ్‌ ఆర్డర్‌ తెచ్చుకోమన్నాము! దానితో ఆయన మరింత ఆగ్రహంతో వచ్చిన దారినే వెనక్కి మళ్లీ గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు.

ఈ లోగా నా వెంట వున్న అన్ని పార్టీల మిత్రులు ఆయన నిజంగా తుపాకీ కాల్పుల ఉత్తరువు తీసుకు వస్తారేమోనని ఆందోళన పడ్డారు! అందులోను మధ్యాహ్న భోజనాల వేళ మించిపోతున్నది. భోజనాలు చేసి వద్దామని, నన్ను కూడా రమ్మన్నారు. తీరా సబ్‌ కలెక్టర్‌గారు ఫైరింగ్‌ ఆర్డర్‌ తీసుకువచ్చేసరికి, మేము భయపడి, పలాయనం చిత్తగించామని నవ్వుకోరూ! అందులోను నేను సైమన్‌ కమీషన్‌ రాక సందర్భంలో మద్రాసులో తెల్లవారి తుపాకీ గుండుకు గుండె చూపించిన తెలుగు వీరుడు "ఆంధ్రకేసరి" ప్రకాశంగారి