పుట:Naa Kalam - Naa Galam.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లోగా ఆంధ్రజిల్లాలలో ప్రజలు ప్రభుత్వాన్నే స్తంభింపజేశారు!

రాజాజీ రహస్య నివేదిక

ప్రజాస్వామిక వాది అయిన నెహ్రూ ఆంధ్ర ప్రజాభిప్రాయాన్ని మన్నించంలో అంత ఆలస్యం చేయడనికి కారణం లేకపోలేదు. శ్రీ పొట్టి శ్రీరాములు పగలు నిరాహారదీక్ష అంటూనే రాత్రి అయ్యేసరికి మర్రి వూడల రసాన్ని త్రాగుతున్నారని, దానిలో ఎన్నో పోషక విలువలు వున్నాయని, అందువల్ల ఆయన మృతి చెందరని, కాబట్టి ఆయన దీక్షను ఖాతరు చేయనక్కరలేదని ఆనాటి మద్రాసు ముఖ్యమంత్రి రాజాజీ ప్రధాని నెహ్రూకు రహస్యంగా నివేదిక పంపారట! అందువల్లనే, ప్రధాని నెహ్రూ పొట్టి శ్రీరాములు గారి నిరాహార దీక్షను గురించి పట్టించుకోలేదని ప్రతీతి!

"ఆంధ్రకేసరి" సభకు అధ్యక్షత....

ఆ సందర్భంగానే నాకు ఆంధ్రకేసరి ప్రకాశం గారి సభకు అధ్యక్షత వహించే అవకాశం కలిగింది. పొట్టి శ్రీరాములు గారి నిరాహారదీక్ష జరుగుతుండగా, డిసెంబర్‌ 14వ తేదీన ఆయన పరిస్థితి విషమించిందని వార్తలు వచ్చాయి. దానితో యావదాంధ్ర దేశంలో నిరాహార వ్రతాలు, హర్తాళ్లు జరిగాయి. కృష్ణాజిల్లా గన్నవరంలో నా ఆధ్వర్యాన హర్తాళ్‌ జరుగుతున్నది. అది అన్ని రాజకీయ పార్టీలు - కాంగ్రెస్‌, కమ్యూనిస్టు పార్టీ, ప్రజా పార్టీ (ప్రకాశం గారిది), కృషి కార్‌ లోక్‌పార్టీ (ఆచార్య రంగాగారిది) పాల్గొంటున్నాయి.

పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యస్థితి విషమంగా వుందన్న వార్త రావడంతో రాజమండ్రి పర్యటనలో వున్న ప్రకాశం గారు ఆ రాత్రి విజయవాడలో మద్రాసు మెయిల్‌ను అందుకోడానికి హుటా హుటిని కారులో