పుట:Naa Kalam - Naa Galam.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ప్రతినిధులు ప్రతిపాదించారు. అప్పుడు ఓటింగ్‌ జరిగితే, కమ్యూనిస్టుల వాదం వీగి పోతుంది. అందువల్ల, సభను వాయిదా వేయాలని, భోజనా నంతరం సభను కొనసాగించ వచ్చునని కమ్యూనిస్టులు వాదించారు.

మైకు కోసం ఆంధ్రకేసరి, చండ్ర పెనగులాట

ఇక సభ కొనసాగడానికి వీలులేదని కమ్యూనిస్టు అగ్రనాయకుడు శ్రీ చండ్ర రాజేశ్వరరావు ప్రకాశంగారి చేతులలోని మైక్‌ లాక్కోబోయారు! అయితే, ప్రకాశం గారు మైకు ఆయనకు అందకుండా పెనుగులాడారు! ఇంతలో విజయవాడ ప్రతినిధి, ఆ పట్టణ మునిసిపల్‌ చైర్మన్‌ డాక్టర్ టి.వి.ఎస్‌. చలపతిరావు గారు లేచి "పొట్టి శ్రీరాములుగారు రాష్ట్రం కోసం 50 రోజులుగా కఠోర నిరాహారదీక్ష చేస్తుండగా, మనం ఒక్క గంట సేపు భోజనాన్ని వాయిదా వేయలేమా?" అంటూ ఆవేశ పూరితంగా మహోపన్యాసం చేసే సరికి సభికులందరు ఆయన వాదంతో ఏకీభవిస్తూ కరతాళధ్వనులు చేశారు! చివరికి మద్రాసుతో కూడిన ఆంధ్రరాష్ట్ర నిర్మాణాన్నే కోరుతూ సభ తీర్మానించినట్టు ప్రకాశం గారు ప్రకటించారు!

వెంటనే ప్రకాశం గారు, బులుసు సాంబమూర్తి గారు, మోతే నారాయణరావు గారు, మరి కొందరు ప్రముఖులు పొట్టి శ్రీరాములుగారు నిరాహారదీక్ష చేస్తున్న శ్రీ బులుసు సాంబమూర్తి గారి నివాస గృహానికి చేరుకున్నారు. నేను కూడా వారితోపాటు వెళ్లాను.

నెహ్రూను నమ్మని శ్రీరాములు!

"మద్రాసు నగరంతో కూడిన ఆంధ్రరాష్ట్రం నిర్మించాలని అఖిలాంధ్ర మహాసభ తీర్మానించింది. తీర్మానాన్ని ప్రధాని నెహ్రూకు పంపాము. ఇక మీరు దీక్ష విరమించండి". అని బహుశా బులుసు సాంబమూర్తి గారు అప్పుడే