పుట:Naa Kalam - Naa Galam.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పూర్వం "ప్రజాసేవ"లో రాసిన సంపాదకీయాలను చూచి, హర్షించి, మొదట నా చేత కూడా ఎప్పుడైనా సంపాదకీయాలు రాయించేవారు. విద్వాన్‌ విశ్వం, ప్రఖ్యాత రచయిత, సంపాదకుడు శ్రీ నండూరి రామమోహనరావు గార్లు ఆ పత్రికకు మొదట సహాయ సంపాదకులు. నార్ల గారి అనంతరం శ్రీ నండూరి "ఆంధ్రజ్యోతి" సంపాదకులైనారు.

మొదటి విడత "ఆంధ్రజ్యోతి"లో 1960 మే నుంచి 1963 జూన్‌ వరకు వున్నాను. ఆ పత్రిక డైరెక్టర్లలో ఒకరైన శ్రీ జి.ఎస్‌. రాజు నన్ను తమకు రాజకీయ కార్యదర్శిగా పనిచేయాలని కోరారు. దాదాపు రెండేళ్లు ఆయనకు కార్యదర్శిగా పని చేసిన కాలంలో నాకు రాజకీయాలతో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత నా ప్రజా జీవితానికి రాజు గారి కార్యదర్శి బాధ్యత నాకు ఎంతగానో తోడ్పడింది. అప్పుడే నాకు డాక్టర్ బెజవాడ గోపాలరెడ్డి గారి వంటి రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి.

పాత్రికేయ జీవితం వదలిపెట్టి, ప్రయివేటు ఉద్యోగమేమిటని ఆ రోజులలో నన్ను కొందరు మిత్రులు, అభిమానులు ప్రశ్నించేవారు. "ప్రఖ్యాత జర్నలిస్టు, పత్రికా సంపాదకులు శ్రీ ఖాసా సుబ్బారావు అమవాన్‌ రాజాకు కార్యదర్శిగా పనిచేశారు. మరో ప్రసిద్ధ జర్నలిస్టు శ్రీ వేలూరి సహజానంద బెజవాడ గోపాలరెడ్డి గారికి కార్యదర్శిగా పనిచేశారు. అలా చాలా మంది జర్నలిస్టులు ప్రముఖులకు సహాయకులుగా పనిచేశారు. అందువల్ల, వారికి ఆ తరువాతి పాత్రికేయ జీవితాలకు ఆ ఉద్యోగాల అనుభవం ఎంతగానో తోడ్పడింది" అని నేను చెప్పేవాడిని.

రెండేళ్ల తరువాత "ఆంధ్రజ్యోతి" సంపాదకులు శ్రీ నార్ల వెంకటేశ్వరరావు నన్ను తిరిగి పత్రికలోకి రావలసిందిగా కబురు పంపారు. నా దృష్టి కూడా పాత్రికేయ జీవితం వైపు మళ్లి నందున, శ్రీ జి.ఎస్‌.రాజు