పుట:Naa Kalam - Naa Galam.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పట్టు పట్టిందంటే, ఇక దానికి తిరుగువుండదు. ఈ విషయం చాలా మంది తల్లిదండ్రులు తెలుసుకోలేక, కుమార్తె అభీష్టానికి అడ్డం తిరిగి, ఎన్నో తిప్పలు తెచ్చుకుంటారు! చివరికి ప్రేమకోసం ఆత్మ బలిదానం చేసిన వారెందరు లేరు!

పరిణయానికి దారితీసిన ప్రయాణం

Naa Kalam - Naa Galam Page 31 Image 0001

అలా మా కలకత్తా ప్రయాణం ప్రణయంగా, ఒక దశలో మాకు ప్రళయంగా, చివరికి పరిణయంగా పరిణమించి, సుఖాంతమైనది! మాకు ఇద్దరు పిల్లలు - ప్రేమ జ్యోతి, జవహర్‌లాల్‌ నెహ్రూ. ముందు పుట్టిన అమ్మాయికి ప్రేమజ్యోతి అని పేరు పెట్టనికి కారణం - మా ప్రేమ వివాహానికి ఆమె తొలి ఫలం. అందువల్ల, ప్రేమ; నేను "ఆంధ్రజ్యోతి" దినపత్రికలో చేరిన రాత్రే - 1960 మే 21 - మాకు అమ్మాయి జన్మించింది. అందువల్ల, "ప్రేమజ్యోతి" అని పేరు పెట్టాము.