పుట:Naa Kalam - Naa Galam.pdf/31

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పెళ్లిచూపులు చూశాను. కాని, ఎవ్వరూ నచ్చలేదు! నాకు అలా పెద్దలు కుదిర్చే పెళ్లి ఇష్టం లేదు. నేను స్వయంగా నిర్ణయించాలన్నది నా వుద్దేశం. నిజానికి, ఆ ఉదయం నుంచే ఉపేంద్ర గారి మాటలు నా మనోవీధిలో నాట్యమాడుతున్నాయి! అయితే, కలకత్తా రైలు విజయవాడలో ఎక్కినప్పటి నుంచి రైలులో ఆమె భావగర్భితమైన పాటలు, చూపులు చూశాక, ఆమెతో మాట్లాక, ఆమె అభిప్రాయాలు, ఆత్మాభిమానం చూశాక ఇక పెళ్లి ఈమెతోనే అనే నిశ్చయానికి వచ్చాను!

ఊహించని, ఆమె నుంచి వచ్చిన ప్రశ్నకు జవాబు దొరక్క కొంత కలవర పడ్డాను! కాని, సర్దుకుని "సరే! నాకేం అభ్యంతరం లే" దన్నాను.

"అయితే, ఒక్కమాట. పెళ్లయిన తరువాత నన్ను నాట్యం చేయనిస్తారా?" అని మళ్లీ అడిగింది. "చేయించకపోతే?" అని ఎదురు ప్రశ్న వేశాను.

"చేయించకపోయినా, మిమ్మల్నే వివాహం చేసుకుంటాను. కాని, నాట్యం చేయలేకపోయినందుకు జీవితాంతం బాధపడతాను" అంది. "అయితే, సరే! చేయిస్తాను" అన్నాను. ఆనందంతో ఆమె ముఖం విప్పారింది!

ఆ తర్వాత దాదాపు ఆర్నెల్లు మా వివాహం విషయంలో వాళ్ల పెద్దల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఆమెను సినీతారను చేయాలని ఆమె తాతగారి వుద్దేశం. అయితే, ఆమె నాన్నగారికి ఆమె ఇష్టమే ఇష్టం! అందువల్ల, చివరకు ఆమె తల్లిదండ్రులు రంగంలోకి వచ్చి, 1959 జూన్‌ 12న మా వివాహం చేశారు. ఈలోగా ఆమె మనస్సు మార్చాలని ఆమె తాత గారు ఎంత ప్రయత్నించినా, ఆమె ససేమిరా అన్నది. "నేను చేసుకుంటే, ఆయన్నే చేసుకుంటాను. లేకపోతే, పెళ్లే చేసుకో"నని ఆమె జవాబు! "క్షణ క్షణముల్‌ జనరాండ్ర చిత్తముల్‌" అని అంటారు. కాని, ప్రేమ, పెళ్లి విషయంలో ఆడపిల్ల