పుట:Naa Kalam - Naa Galam.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిమిషాల సేపు మాట్లాడే అవకాశం నాకు కలిగినప్పుడు రాష్ట్రాన్ని ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు గల పరిజ్ఞానాన్ని చూచి ఆశ్చర్యపడ్డాను. ఆయన సూచనలు, సలహాలు నాకెంతో ఉపయోగపడ్డాయి."

- శ్రీ హెచ్‌.సి. సరీన్‌
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ మాజీ సలహాదారు

"ఆంధ్ర, తదితర మహానాయకుల జీవితాలను గురించి శ్రీ తుర్లపాటి కుటుంబరావు వ్రాసిన వ్యాసాలు మణిపూసలవంటివి. జీవితాంతం వ్యక్తులను, సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయగలవారే ఇలాంటి ప్రయోజనకరమైన రచనలు చేయగలరు. అందువల్లనే శ్రీ తుర్లపాటి కుటుంబరావుకు మద్రాసు సాహిత్య కేంద్రం వారు "వ్యాస విద్యా విశారద" బిరుదు ప్రదానం చేస్తున్నారు. శ్రీ కుటుంబరావు రచనలు మరింతగా వ్యాప్తిలోకి రావడం అవసరం."

- మదాస్రు సాహిత్య కేందం

"జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలను లోతుగా పరిశోధించి, పరిశీలించి, ఆయా రాజకీయ వేత్తల మనస్తత్వాలను వాస్తవంగా బేరీజు వేయడంలో తుర్లపాటికి తుర్లపాటే సాటి".

- డాక్టర్ వై.యస్‌. రాజశేఖర రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్య మంత్రి

"తెలుగు వారికి గర్వకారకుడు తుర్లపాటి"

- శ్రీ నారా చంద్రబాబు నాయుడు
మాజీ ముఖ్యమంత్రి