పుట:Naa Kalam - Naa Galam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కన్నీరు సృష్టించిన కలవరం

ఎందువల్ల నంటే, అంతకు పూర్వం క్లాసు మానిటర్‌గా నేను కాజ జనార్దనరావు అనే విద్యార్ధితో పోటీ చేసి, విద్యార్ధినుల ఓట్లతోనే గెలిచాను! ఒకరా, ఇద్దరా? 14 మంది అమ్మాయిలు "ఎన్‌బ్లాక్‌" గా నాకే ఓటు వేశారు! అయినప్పుడు, నేను వారిని అలా అవహేళన చేస్తానని వారు ఊహించలేదు! ఇక, స్వరూపరాణి అయితే, నావంక చూసి, బొట బొట కన్నీరు కార్చింది! ఆ కన్నీరు నన్ను కదిలించి వేసింది! నేను తప్పు చేశానని అనిపించింది. ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు! ఎంతో సేపు నేను ఎందుకు అలా తప్పుగా మాట్లానని ఒకటే బాధ! ఆ రాత్రల్లా చాలాసేపు కన్నీటి స్వరూపరాణి రూపమే జ్ఞాపకం రాసాగింది. అప్పటికి నాకు 14 సంవత్సరాలే!

ఆ మరునాడు స్కూలుకు వెళ్లగానే అమ్మాయిలు కూర్చునే బ్లాక్‌లోకి వెళ్ళి అందరికీ "సారీ" చెప్పాను! ఇక ఎప్పుడూ స్త్రీలను గురించి అలా మాట్లాడనని, డిబేటింగ్‌ సొసైటీలో వారిని గురించి అన్న మాటలను ఉపసంహరించుకుంటున్నానని చెప్పాను. వారు చాలా సంతోషించారు.

ఆ సంఘటన నా జీవితంపై ఎంతో ప్రభావం చూపించింది. అప్పటి నుంచి జీవితాంతం స్త్రీలను పురుషుల కంటె ఎక్కువగా గౌరవించాలని, ఏ పరిస్థితిలోను వారిని గురించి కించపరిచే విధంగా మాట్లాడరాదని నిర్ణయించుకున్నాను.

నా వివాహమైన తరువాత కూడా నా భార్యను "ఏమండీ!" అని సంబోధించే వాడిని! ఎందువల్ల నంటే, ఆమె నాకు పెళ్లికి పూర్వమే పరిచయం అయింది. అప్పుడు సహజంగా ఆమెను మీరు, ఏమండీ! అని సంబోధించేవాడిని. ఔను! పెళ్లికి పూర్వం ఏమండీ! అని పిలిచిన వ్యక్తిని పెళ్లి కాగానే "ఒసేయ్! ఏమేవ్‌!" అని పిలవాలా? ఏమి! పెళ్లి కాగానే స్థాయి,