పుట:Naa Kalam - Naa Galam.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


మిత్రులే కారకులు. అందువల్లనే, "స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం" అన్నాడొక కవీంద్రుడు. నాకు మొదటి నుంచి మిత్రులు తక్కువ. అభిమానులే ఎక్కువ. వారిలో కొందరు వీరాభిమానులు ! మరి కొందరు మూఢాభిమానులు! ఇది ఆత్మస్తుతి కాదు - వినమ్రతతో చెప్పే మాట; ఆ నామిత్రుల పట్ల గౌరవాభిమానాలతో, కృతజ్ఞతతో చెప్పేమాట!

Naa Kalam - Naa Galam Page 108 Image 0001

వారిలో ముగ్గురు అగ్రగణ్యులు - వల్లభనేని లక్ష్మీదాసు, జె.ఎస్‌.టి.శాయి, మల్లాది రామకృష్ణ ! వీరు నా చిన్న నాటి నుంచి ఇప్పటి వరకు నాకు హితులుగా, స్నేహితులుగా, వీరాభిమానులుగా ఉన్నారు. మా అనుబంధం అనిర్వచనీయం. వీరి ముగ్గురివీ మూడు విభిన్నమైన వ్యక్తిత్వాలు. నిజానికి, ఒక ఇంగ్లీషు సూక్తి పేర్కొంటున్నట్టు, ఏ మనిషికి ఆ మనిషి ఒక టైప్‌. వీరిలో లక్ష్మీదాసు ఆవేశపరుడు. నన్ను గురించి నా సన్నిహిత బంధువులైనా పల్లెత్తు మాట అంటే, తానే రేచుకుక్కవలె వారిపై