పుట:Naa Kalam - Naa Galam.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాశారని వివరిస్తూ తన వద్ద ఉన్న స్విస్‌ ఆర్థిక మంత్రి లేఖ కాపీలను (అంతకు పూర్వమే వాటిని సిద్ధం చేయించి ఉంటారు) శాసన సభ్యులందరికీ పంచిపెట్టించారు. అక్కడితో ఆయనను విమర్శిస్తున్న వారు మారు మాట్లా లేకపోయారు !

ఇక్కడ ధర్మ "రాజనీతి"ని జ్ఞాపకంచేసుకోవాలి. వనవాసంలో ఉన్న తమను అవమానించడానికి చతురంగ బలాలతో వచ్చిన కౌరవులను గంధర్వ రాజు బంధించాడు. ఈ వార్త తెలిసిన ధర్మరాజు కౌరవులను విడిపించవలసిందిగా భీమార్జునులను ఆదేశించగా, వారు "కాగల కార్యం గంధర్వులే తీర్చారు. మన శత్రువులను గంధర్వులే బంధించి, మనం చేద్దామనుకున్న పని వారే చేసిపెట్టారు. మనం కౌరవులను ఎందుకు విడిపించా"లని ప్రశ్నించగా, "మనలో మనకు తగాదా వస్తే, వారు నూరుగురు, మనం అయిదుగురం. కాని, చంద్ర వంశీకులమైన మనపై ఎవరు దాడి చేసినా, మనం 105 మందీ వారిని ఎదిరిస్తా"మని ధర్మరాజు చెప్పిన నీతి ఎప్పడైనా, ఎవరికైనా అనుసరణీయమే.

అమెరికాలో చర్చిల్‌ ప్రవచనం

1946లో ఒకసారి బ్రిటిష్‌ మాజీ ప్రధాని చర్చిల్‌ అమెరికా వెళ్లగా, అక్కడి విలేకరులు ఆయనను అప్పటి బ్రిటిష్‌ లేబర్‌ పార్టీ ప్రభుత్వం పై ఆయన అభిప్రాయమేమిటని అడుగగా, " స్వదేశంలో మేము ప్రత్యర్థులమే. కాని విదేశాలకు వచ్చినప్పుడు మేమందరం ఒక్కటే, మేమందరం బ్రిటిష్‌ పౌరులమే, మా దేశ ప్రభుత్వాన్ని విదేశంలో ఎలా విమర్శిస్తాము ? మా దేశంలో లేబర్‌ పార్టీ ప్రభుత్వం మా కన్సర్వేటివ్‌ పార్టీ ప్రభుత్వం కంటే బాగానే పని చేస్తున్నది" అని చర్చిల్‌ సమాధాన మిచ్చాడు.! బ్రిటిష్‌ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థనే పాటిస్తున్న మన దేశంలో ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, వారికైనా చర్చిల్‌