పుట:Mollaramayanam2.djvu/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరస్తు.

మొల్లరామాయణము.

బాల కాండము.

     శ్రీమహిమాభిరాముడు వసిష్ఠమహామునిపూజితుండు సు
     త్రామవధూకళాభరణరక్షకు డాశ్రితపోషకుండు దూ
     ర్వామలసన్ని భాంగుడు మహాగుణశాలి దయాపరుండుశ్రీ
     రాముడుప్రోచు భక్తతతి రంజిలునట్లుగ నెల్లకామున్.

ఉ. శ్రీనగమందిరుం డమరసేవితు డర్ధశశాంక మౌళి స
    న్మౌనిమన:పయోజదిననాయకు డబ్జభవామరేశ్వర
    ద్యానలసత్ప్రసన్ను డతిధన్యుడు శేషవిభూషణుండు వి
    ద్యానిధిమల్లి కార్జునుడు తానిడుమాకుశుభంబులొప్పుగన్.

ఉ. తెల్లనిపుండరీకముల తేజము మెచ్చవి కన్నుదోయితో
    నల్లనశక్రనీలరుచి నవ్వెడు చక్కని దేహకాంతితో
    నల్లని బిల్లగ్రోవి కరమందలిసంజ్ఞల నింపు నింపగా
    గొల్లతలన్ విరాలి తగ గొల్పెడు కృష్ణుడుప్రోచుగావుతన్.